Banjra Hills Pub Case : హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పబ్ కేసులో పలువురు ప్రముఖులు ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే అక్కడ ఉన్న వారందరిదీ తప్పనడం మాత్రం కరెక్ట్ కాదంటూ షార్ట్ ఫిల్మ్ నటి కల్లపు కుషితా అన్నారు. అక్కడ డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న విషయం తమకు అస్సలు తెలియదని చెప్పింది. అంతే కాదు అసలు అక్కడ డ్రగ్స్ సరఫరా జరుగుతుందని తెలిస్తే వెళ్లే వాల్లమే కాదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు.
అక్కడ రష్ ఎక్కువగా ఉన్న మాట వాస్తవం.. మా ఫ్రెండ్స్ పార్టీ అయ్యాక బయటకి వెళ్దామని అనుకునే లోపే పోలీసులు వచ్చారు. అయితే అక్కడ పోలీసులు డ్రగ్స్ ని కూడా గుర్తించారు. కానీ అక్కడ ఉన్న వాళ్లందరినీ బాధ్యులను చేయడం.. పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడం సరికాదు. పోలీసులు వచ్చారు మా డిటైల్స్ తీసుకున్నారని పేర్కొంది. కావాల్సి వస్తే మా రక్త నమూనాలు కూడా తీసుకోండని.. మేం ఎప్పుడైనా శాంపిల్స్ ఇవ్వడానికి సిద్ధమేనని వివరించారు.
Read Also : ECIL Recruitment: నిరుద్యోగులకు శుభవార్త.. రాత పరీక్ష లేకుండానే ECIL లో 1625 ఉద్యోగాలు!