Samantha Yashoda : సమంత విడాకుల తర్వాత ఫుల్ బిజీగా లైఫ్ లీడ్ చేస్తోంది. వరుస ఆఫర్లతో పాన్ ఇండియా మూవీలతో దూసుకెళ్తోంది. ప్రేమ వివాహంతో ఒకటైన నాగచైతన్య, సమంత జంట.. ఏడేళ్ల ప్రేమకు, 4ఏళ్ల వివాహ బంధానికి బ్రేకప్ చెప్పేసి.. 2021 అక్టోబర్ 2న విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. నాగచైతన్యతో బ్రేకప్ అనంతరం సామ్ తన లైఫ్ పై ఫుల్ ఫోకస్ పెట్టేసింది. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోంది.
అదే క్రమంలో పాన్ ఇండియా మూవీ యశోదలో నటించేందుకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హరి-హరీష్ ద్వయ దర్శకత్వంలో యశోద మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి నిర్మాతగా శివలెంక కృష్ణ ప్రసాద్ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే.. యశోద మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక రిలీజ్ కావడమే ఆలస్యం.. అందుకే చిత్ర యూనిట్ కూడా ఈ మూవీని ఆగస్టు 12న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

అయితే ఇదే రోజున సమంత యశోద రిలీజ్ చేయాలనుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే.. అదేవారంలో ఇద్దరు హీరోల మూవీలు కూడా రిలీజ్ కానున్నాయి. వాళ్లు ఎవరో కాదు.. అక్కినేని బ్రదర్స్.. నాగచైతన్య, అఖిల్.. వీరిద్దరి మూవీలు కూడా బాక్సాఫీసు వద్ద సందడి చేయనున్నాయి. అయితే సమంత కూడా తన యశోద మూవీని అదే వారంలో రిలీజ్ చేసేందుకు రెడీ అయింది. ఒకరేమో తన మాజీ భర్త నాగచైతన్య, మరొకరు అఖిల్.. అయినప్పటికీ తగ్గేదేలే అన్నట్టుగా సమంత అదే వారంలో యశోదతో గట్టి సవాల్ విసురుతోంది..
నాగచైతన్య నటించిన అమీర్ ఖాన్ టైటిల్ పాత్రలో ‘లాల్ సింగ్ చద్ధా’ 2022 ఆగస్ట్ 11న రిలీజ్ కానుంది. 2022 ఆగస్టు 12న అఖిల్ అక్కినేని హీరోగా నటించిన యాక్షన్ మూవీ ఏజెంట్ రిలీజ్ కాబోతోంది. అక్కినేని బ్రదర్స్ కు పోటీగా సమంత ఊహించని షాకిచ్చింది. అక్కినేని హీరోలకు బాక్సాఫీస్ వద్ద గట్టి సవాల్ విసురుతోందని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.

అక్కినేని బ్రదర్స్ మూవీలకు పోటీగా సమంత కూడా యశోదతో ఢీకొట్టబోతోంది. ఈ మూడు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో విడుదల కానున్నాయి. మరి.. ఈ ముగ్గురిలో ఎవరూ వెనక్కి తగ్గుతారో.. లేదా తగ్గేదేలే అన్నట్టుగా అదేవారంలో మూవీని రిలీజ్ చేస్తారో లేదో చూడాలి.
Read Also : Samantha Majili : చైతూతో ఆ మూడేళ్ల ‘మజ్లీ’ని గుర్తు చేసుకున్న సమంత.. ఫ్యాన్స్ రియాక్షన్..!