Balakrishna : మగాళ్లకు మంచి టిప్ ఇచ్చిన బాలకృష్ణ.. భార్య విషయంలో ఆయన అదే ఫాలో అవుతాడట..

Balakrishna : ఆహాలో నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ రియాలిటీ షో చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు తాజాగా రానా విచ్చేశారు. ఈ టైంలో వీరిద్దరి మధ్య కాస్త ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు, మాటలు చోటుచేసుకున్నాయి. ఇక గతంలోనూ రానా చేస్తున్న షో నంబర్ వన్ యారి లోనూ బాలకృష్ణ గెస్ట్ గా విచ్చేసి అందరినీ ఎంటర్‌టైన్ చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా అన్ స్టాపబుల్ ప్రోగ్రాంతో తిరిగి వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించి వారి ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చారు.

ఈ టైంలో బాలకృష్ణ, రానా మధ్య కొన్ని ఫన్నీ, ఆసక్తికర చర్చలు నడిచాయి. ఇక బాలకృష్ణ రానాకు కొన్ని టిప్స్ చెప్పాడు. తనకు పెళ్లయిన రోజునే ఒక కాంప్రమైజ్ కు వచ్చాడట బాలయ్య. బయటకు వెళ్లినప్పుడు మొత్తం నేనే మాట్లాడతా.. నువ్వు సైలెంట్ గానే ఉండాలని అని చెప్పాడట. ఇంట్లో నువ్వు ఎంత వైలెంట్ గా ఉన్న నేను సైలెంట్ గా ఉంటానని తన భార్యతో అగ్రిమెంట్ చేసుకున్నాడట బాలయ్య. ఈ విషయాన్ని రానాకు సైతం సూచించాడు.

ఇంట్లో ఆర్గ్యుమెంట్ వస్తే ముందు ఎవరు సారీ చెబుతారు అని రానా.. బాలకృష్ణను అడగగా.. నేను చెప్పాలి తప్పదు కదా అని సమాధానమిచ్చాడు బాలయ్య. సారి చెప్పడం కూడా మన బాధ్యతే అని చెప్పుకొచ్చాడు. కృష్ణుడి అంతటి వాడే సత్యభామ కాళ్లు పట్టుకున్నాడు.. ఇక ఈ బాలకృష్ణుడు ఓ లెక్కనా.. అని నవ్వుతూ చెప్పాడు బాలకృష్ణ. మీకు వంటలపై ఏమైనా టచ్ ఉందా అని రానా అడగ్గా.. ఇప్పటి వరకు చేయలేదు కానీ ఎలా చేయాలో మాత్రం చెబుతానంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు బాలయ్య. ఇలా వీరిద్దరి మధ్య సాగిన ఎపిసోడ్ ఎంతో సరదాగా అనిపించింది.

Advertisement

Read Also : Ramesh Babu : హీరో మహేష్ సోదరుడు రమేష్ బాబు కన్నుమూత

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

RELATED POSTS

Join our WhatsApp Channel