Anchor Shyamala Comments : లైంగిక వేధింపులు సినిమా పరిశ్రమలో సహజం అని అందరూ అనుకుంటారు. అసలు లైంగిక వేధింపులు కూడా సినిమా పరిశ్రమ వేరుగా ఉండదని భావిస్తారు. ఇప్పటికే ఎంతో మంది నటీమణులు తాము లైంగికంగా వేధించబడ్డామని మీడియా ముందుకు వచ్చారు. ఇప్పుడంటే లైంగిక వేధింపులు ఎదుర్కొన్న వారు మీడియా ముందుకు వస్తున్నారు కానీ పాత రోజుల్లో ఇలా ఉండేది కాదు.
మీడియా, సోషల్ మీడియా ఇంతగా లేకపోవడంతో లైంగికంగా వేధించబడ్డా కూడా నటీమణులు సైలెంట్ గా ఉండేవారు. అలాంటి కోవకే చెందుతుంది తెలుగు యాంకర్ శ్యామల. యాంకరింగ్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ బ్యూటీకి కూడా మొదట్లో లైంగిక వేధింపులు ఎదురయ్యాయని షాకింగ్ కామెంట్స్ చేసింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు మాట్లాడుతూ.. చిన్ననాటే తన తండ్రి చనిపోవడం వలన తన తల్లి అనేక కష్టాలు పడి తనను పెంచి పెద్ద చేసిందని, దాంతోనే తాను పెరిగానని చెప్పుకొచ్చింది. ఇక నటన మీద తనకున్న ఆసక్తిని గమనించిన తన తల్లి తనను ఆర్టిస్ట్ గా చేసేందుకు చాలా కష్టపడిందని చెప్పింది. అలా సినిమా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఓ సూపర్ హిట్ సీరియల్ లో నటించే అవకాశం వచ్చిందని, కానీ ఆ సీరియల్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఒకరు తనతో చాలా బ్యాడ్ గా బిహేవ్ చేశాడని షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఈ విషయాన్ని తాను ఆ సీరియల్ దర్శకుడికి, నిర్మాతలకు చెప్పానని అయినా కానీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పుకొచ్చింది. కానీ తన భర్త అయిన నరసింహం తనకు పరిచయమయ్యాక ఆ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కు గట్టి వార్నింగ్ ఇప్పించానని చెప్పింది. ఇక దాంతో ఆ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తన జోలికి రాలేదని పేర్కొంది.
Read Also : RGV Comments : చంద్రబాబు ఏడ్చిన ఘటనపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే..?
















