...

Whats App: జనవరిలో 18 లక్షల వాట్సాప్ అకౌంట్స్ బ్యాన్… కారణం అదేనా?

Whats App: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ఫోన్ తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ లో తప్పనిసరిగా ఉండే యాప్స్ లో వాట్సాప్ ఒకటి. వాట్సప్ ద్వారా ఎంతో సులభంగా ఎంతో ముఖ్యమైన సమాచారాన్ని ఒకరి నుంచి మరొకరికి మనం ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఇలా ఎంతో ముఖ్యమైన ఈ యాప్ ప్రతినెల కొన్ని లక్షల అకౌంట్లను బ్యాన్ చేయబడుతోంది. అసలు వాట్సప్ అకౌంట్ ను బ్యాన్ చేయడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే…

Advertisement

భారతీయ ఐటి నియమ నిబంధనల ప్రకారం 2022 జనవరి నెలలో ఏకంగా 18 లక్షల వాట్సాప్ అకౌంట్లను మెటాకి చెందిన వాట్సాప్ బ్యాన్ చేసింది.ఈ క్రమంలోనే ఈ విషయాన్ని గ్రీవెన్స్ రిపోర్ట్ ద్వారా వెల్లడించారు రిపోర్ట్ ఆధారంగా ప్రతినెల ఎన్ని అకౌంట్లను బ్యాన్ చేస్తున్నారనే విషయాన్ని వెల్లడిస్తున్నారు. అయితే ఈ వాట్సాప్ అకౌంట్ ను బ్యాన్ చేయడానికి గల కారణం ఏమిటి అంటే… యూజర్ ల నుంచి ఫిర్యాదుల విభాగానికి వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా వీటిని బ్యాన్ చేయబడుతుంది.

Advertisement

ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరి నెలలో భారత దేశానికి చెందిన 495 భారతీయ అకౌంట్ల నుంచి 285 అకౌంట్లను బ్యాన్ చేయాలని ఫిర్యాదులు రావడంతో వాటిని బ్యాన్ చేశారు. వాట్సాప్ రూపొందించిన పలు రిసోర్సెస్, వాట్సాప్ టూల్స్ ఆధారంగా హానికరమైన వాటిని గుర్తించి ఈ నెలలో 18.58 లక్షల వాట్సప్ అకౌంట్లను బ్యాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మద్యంతర గైడ్ లైన్స్, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ నియమ నిబంధనల ప్రకారం ఈ వాట్సాప్ అకౌంట్లను నిషేధించినట్లు వెల్లడించారు.

Advertisement
Advertisement