...

Devatha : రాధ చీర లాగిన ఆదిత్య… ఆదిత్యను అసహ్యించుకుంటున్న దేవి..!

Devatha Feb 22 Today Episode : బుల్లితెరపై ప్రేమానురాగాల ధారావాహిక దేవత.. మరి దేవత సీరియల్‌ తాజా ఎపిసోడ్‌ లేటెస్ట్‌ హైలెట్స్‌ ఏంటో చూసేద్దాం. పటేలు పక్కింటి ఆమెకు లైన్‌ వేస్తూ ఉండడాన్ని చూసి తనను పటేల భార్యదగ్గర ఇరికిస్తాడు బాష.సీన్‌ కట్‌చేస్తే భజన కార్యక్రమానికి రాధ కుటుంబంతో సహా గుడికి వెళ్తుంది. అక్కడికే ఆదిత్య కూడా వస్తాడు. ఆదిత్యను చూసిన దేవీ కోపంతో ఉంటుంది రాధ బాధపడుతూ ఉంటుంది. ఆదిత్యను రాధ వాళ్ల మామయ్య దగ్గరుండి భజన కార్యక్రమానికి తీసుకుని వస్తాడు. ఒకరినొకరు చూసుకుని రాధ ఆదిత్య బాధపడుతూ ఉంటారు. అంతలో చిన్మయి నానమ్మ నాకు దాహం వేస్తుంది అంటుంది దానికి అయ్యో తీసుకువస్తా ఆగు అంటూ ఉంటే రాధ నేను వెళ్తాను అని వెళ్తుంది. అది చూసిన ఆదిత్య రాధవెనుకే వెళ్తాడు.

Advertisement

రాధని నువ్వనుకున్నది సాధించావుగా అంటాడు ఆదిత్య. పసిపిల్లను నానుంచి దూరం చేసి నువ్వ్ ఎంత తప్పుచేస్తున్నావో నీకు అర్థం అవుతుందా అని అడుగుతాడు. దానికి ఇంక ఎన్నిరోజులు రుక్మిణి ఇదాంతా ఎంకా ఎన్నిరోజు నన్ను  బాధపెడతావు. ఇంక నన్ను నా బిడ్డ దృష్టిలో చెడ్డవాడిని చెయ్యకు ఇప్పటికే నన్ను నా బిడ్డ దృష్టిలో దుర్మార్గుడిని చేశావ్‌ నా బిడ్డను తెచ్చి నాకు అప్పగించు అని అడుగుతాడు ఆదిత్య నాతోని కాదు చావు అయినా బతుకు అయినా నా బిడ్డతోనే అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంటే తన కొంగు కారులో చిక్కుకుని ఉంటుంది. దానిని తీసి రాధకు ఇస్తూ ఉంటే అమ్మను వెతుక్కుంటూ వచ్చిన దేవి వాళ్ల అమ్మ అక్కడినుంచి ఏడుస్తూ ఆఫీసర్‌ సర్‌ మా అమ్మ చీర లాగిఏడిపిస్తాడా అని అనుకుంటూ ఉంటుంది.

Advertisement
devatha serial latest episode
devatha serial latest episode

సీన్‌ కట్‌ చేస్తే దేవుడమ్మ పార్కులో పిల్లలకోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అంతలో చిన్మయి రాధ అక్కడి వస్తారు. మాకోసం ఏమి తీసుకురాలేదా అని దేవి అంటుంది అయ్యో లేదమ్మా అంటుంది. చిన్నపిల్లల మనసు తెలియకుండా నువ్‌ ఎలా పెద్దదానివి అయ్యావో అంటుంది. అరిసెలు తీసుకుని ఇస్తుంది మాకు అరిసెలు అంటే చాలా ఇష్టం నీకెలా తెలుసు అని అడుగుతుంది. దానికి దేవుడమ్మ మీ ఇష్టాఇష్టాలు అన్నీ నా కొడుకు నాకు చెప్పాడమ్మా అని చెప్తుంది. ఎలాగైనా దేేవిని ఆదిత్యను కలపాలని దేవుడమ్మ మనసులో అనుకుంటుంది.

Advertisement

బాషకమలలు సరదాగా మాట్లాడుకుంటుంటారు. బాష నువ్‌ ఎంతగలీజ్‌గా ఉంటావో తెలుసా అంటుంది కమల అదేంటీ అని నేనే మంచిగానే ఉంటానే అద్దంలో కూడా చూసుకుంటాను అని ఆలోచిస్తు ఉంటాడు. దానికి కమల అంత ఆలోచించకులే నువ్‌ చాలా బాగుంటావ్‌ బాషా నీ మనసు చాలా మంచిది అని చెప్తుంది. దీనితో ఈ రోజు ఎపిసోడ్‌ ముగుస్తుంది. మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం.

Advertisement

Read Also : Devatha: దేవి మాటలకు ఎమోషనల్ అయిన రాధ.. ఆదిత్య నిలదీసిన సత్య?

Advertisement
Advertisement