Intinti Gruhalakshmi: అభిని ఎస్సై ఏం చేయనున్నాడు.. తులసి అభిని విడిపించగలదా..?

gruhalakshmi serial latest episode
gruhalakshmi serial latest episode

Intinti gruhalakshmi: టీవీ రంగంలో ప్రముఖ టాప్‌ సీరియల్‌ ఇంటింటి గృహలక్ష్మి. మరి ఈ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. మరి ఎపిసోడ్ 561 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అభి విషయంలో జరిగినదంతా తులసి ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్లకు చెప్తుంది. అభిని ఎలాగైనా విడిపించాలని అంటుంది. దానితో నందు లాస్య తులసిపై ఫైర్‌ అవుతారు. ఈ ఇంట్లో అందరూ తులసి మాటలే వింటారు లాస్య అని నందు అంటాడు. నా మాట ఎవ్వరూ ఖాతరు చేయరు. చూద్దాం.. అభి విషయంలో తులసి ఎంత దూరం వెళ్తుందో. అప్పుడు నేనే ఇంటి పగ్గాలు తీసుకుంటా. ఏం చేస్తుందో చూస్తా. పరిస్థితి చేయి దాటి పోతే ఇక ఎవరి మాట వినను అంటూ నందు సీరియస్ అవుతాడు. మరోవైపు తులసి దిగులు పడుతూ ఉంటుంది.

అప్పుడే మాధవి వస్తుంది. అందరికీ ధైర్యం చెప్పాల్సిన నువ్వే దిగులు పడితే ఎలా వదిన అని అంటుంది. నీ బిడ్డ గురించి నువ్వు ఒంటరి పోరాటం చేయాల్సిందే. బయట శత్రువులతో పాటు ఇంట్లోని శత్రువులతో కూడా అంటుంది మాధవి. దీంతో నా బిడ్డ కంటే నాకు ఎవ్వరూ ఎక్కువ కాదు మాధవి అంటుంది తులసి.

Advertisement

gruhalakshmi serial latest episode

దీంతో వెంటనే లాయర్ మాట్లాడుతూ.. అభిని రిలీజ్ చేయడానికి బెయిల్ పేపర్స్ తీసుకొచ్చాం అంటాడు దీంతో వాటిని చూసి పేపర్లు ఓకే.. ఇంతకీ అభి ఎవరు అని అడుగుతాడు పోలీస్. దీంతో తులసి షాక్ అవుతుంది. అదేంటి సార్.. అప్పుడే మరిచిపోయారా. నిన్న మా అబ్బాయిని అరెస్ట్ చేశారు కదా అని అడుగుతుంది తులసి. దీంతో అసలు మీరు ఎవరు.. మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదే.. అసలు మీ అబ్బాయి ఎవరు.. అని అంటాడు ఎస్ఐ.

Advertisement

నేను అబద్ధం చెబుతున్నానని అనుకుందాం. నాతో పాటు కానిస్టేబుల్స్ కూడా ఉంటారు కదా. వాళ్లను వెళ్లి అడుగు అంటాడు ఎస్ఐ. దీంతో కానిస్టేబుల్స్‌ను వెళ్లి అడుగుతుంది తులసి. కానీ.. ఎవ్వరూ మాకు తెలియదు అంటారు. దీంతో మీకు ఇంకా నమ్మకం రావడం లేదా.. అయితే వెళ్లి సెల్‌లో వెతుక్కోండి. మీకే నమ్మకం వస్తది అంటాడు పోలీస్.

దీంతో స్టేషన్లో ఉన్న అన్ని సెల్స్‌ను వెతుకుతుంది. కానీ అభి కనిపించడు. దీంతో మేడంను తీసుకెళ్లి ఇంటి దగ్గర దిగబెట్టండి. మళ్లీ ఇటువైపు రావద్దని చెప్పండి.. అని లాయర్కు చెప్పాడు ఎస్సై దానితో తులసికి కోపం వస్తుంది.

Advertisement

ఇన్ స్పెక్టర్ గారు మా అభిని ఎక్కడ దాచారు అంటూ సీరియస్ అవుతుంది. నా బిడ్డను చూపించేంత వరకు స్టేషన్ కదిలేది లేదు. ఇక్కడే కూర్చుంటా.. ఎవ్వరినీ బయటికి వెళ్లనివ్వను అంటుంది తులసి. దీంతో ఎస్ఐ కూడా సీరియస్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement