Hang Wall Clock : హిందూ సంప్రదాయాలు, జాతకాలను నమ్మేవారు ఎక్కువగా వాస్తు శాస్త్రాన్ని కూడా నమ్ముతుంటారు. ఇలాంటి వ్యక్తులు ప్రతీది కాలికులేటెడ్ గా ఆలోచిస్తుంటారు. ఇంట్లో ఏదైనా చెడుగా జరుగుతుందంటే వాస్తు ప్రకారం పరిహారాలు వెతుకుతుంటారు. ప్రస్తుతం మనం టైం, గోడ గడియాలకు సంబంధించిన విషయం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంట్లో గోడగడియారాన్ని వాడే వారు ఎలాంటి ఫార్ములాను (Where to hang wall clock in living room) పాటించాల్సి ఉంటుంది ఇపుడు తెలుకునే ప్రయత్నం చేద్దాం..
గడియారంలో సూచించే టైం అనేది మన అదృష్టానికి కూడా పరీక్ష పెడుతుంది. వాస్తు శాస్త్రంలో దీనికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయట.. టైం అనేది భవిష్యత్‌ను సూచిస్తుంది కాబట్టి మన ఫ్యూచర్ బాగుండాలంటే ఈ సూత్రాలను తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. వాస్తు ప్రకారం గోడ గడియారాన్ని తూర్పు దిశలో పెట్టుకోవాలట.. అప్పుడే ఆ ఇంట్లో ఆనందం, ఆరోగ్యం, అదృష్టం కలుగుతాయని తెలుస్తోంది. ఇక లోలకమున్న వాచ్ అనేది చాలా పవిత్రమైనదిగా భావిస్తారట.. దీన్ని ఉత్తరం లేదా తూర్పున మాత్రమే పెట్టుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ఒకవేళ గోడ గడియారాన్ని ఇంట్లో దక్షిణం వైపు పెడితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందట.. కుటుంబంలోని వ్యక్తుల ఆరోగ్యం కూడా చెడిపోవడానికి కారణం కావొచ్చు. అంతేకాకుండా గడియారాలను ఇంట్లో దర్వాజ పైన అస్సలు పెట్టరాదు.వాచ్ కింద నుంచి మనం వెళ్తుంటే ఆ వ్యక్తిపై ప్రతికూల ప్రభావం పడుతుందట..విరిగిపోయిన లేదా ఆగిపోయిన గడియారాలను కూడా ఇంట్లో ఉంచుకోరాదట.. అలా చేస్తే దురదృష్టం వెంటాడుతుందని తెలుస్తోంది.
Read Also : Oxygen Level in Body : బాడీలో ఆక్సిజన్ లెవల్స్ పెరగాలంటే వీటిని తీసుకోండి..!
Tufan9 Telugu News providing All Categories of Content from all over world