Oxygen Level in Body : కరోనా ఒమిక్రాన్ రూపంలో మళ్లీ విజృంభించే అవకాశం ఉందని వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో జనాల్లో భయం మొదలైంది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ (Medicine to increase Oxygen Level in Body) తగ్గకుండా చూసుకోవటం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా అవసరం. మనకు సులభంగా దొరికే కూరగాయాలు, పండ్లతోనే ఆక్సిజన్ లెవెవల్స్‌ను పెంచుకోవచ్చు. అవి ఏంటో ఓసారి పరిశీలిద్దాం.
కివి ఫ్రూట్ (Kivi Fruit) :
దీన్ని రెగ్యులర్‌గా తీసుకుంటే అందులో ఉండే పోషకాలు పుష్కలంగా శరీరానికి లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో సి-విటమిన్ అధికంగా ఉండటంతో శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ పుష్కలంగా అందుతుంది. ప్రస్తుత కరోనా సమయంలో ప్రతి ఒక్కరు కివి ఫ్రూట్‌ను నిత్యం తీసుకుంటే మంచింది.
చిలగడ దుంప :
ఇందులో పొటాషియం, మెగ్నీషియం, మినరల్స్ అధిక స్థాయిలో ఉంటాయి. ప్రొటీన్, ఫైబర్ కూడా ఉండడంతో జీర్ణక్రియ మెరుగవుతుంది. నిత్యం చిలగడదుంపను తీసుకుంటుంటే బాడీకి కావాల్సిన పోషకాలు పుష్కలంగా అందుతాయి. పొట్టలో గ్యాస్ట్రిక్ సమస్యలు, అల్సర్లలతో బాధపడుతుంటే చిలగడ దుంప తీసుకుంటే ఉపశమనం పొందవచ్చు. కొన్ని ప్రాంతాల్లో దీన్ని గెనిసి గడ్డ అని కూడా పిలుస్తారు.
దోసకాయ – పుచ్చకాయ :
దోస, పుచ్చకాయల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. డ్రీ హైడ్రేషన్ గురైన వారు వీటిని తీసుకుంటే శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ పెరిగి త్వరగా కోలుకుంటారు. దోసకాయ అన్ని కాలాల్లో దొరుకుతుంది. అయితే పుచ్చకాయం కేవలం వేసవిలోనే ఎక్కువగా లభిస్తుంది. రక్తంలో ఆక్సిజన్ లెవల్స్ పడిపోయివారికి దోస జ్యూస్ తాగితే వారిలో వెంటనే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతూ వస్తాయి.
అలాగే సిట్రస్ జాతికి చెందిన నిమ్మకాయలను డైలీ ఏదో రూపంలో తీసుకున్న ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో సి-విటమిన్ పుష్కలంగా ఉంటుంది. బాడీలో ఆక్సిజన్ లెవల్స్ పెరగటానికి నిమ్మ బాగా సహాయపడుతుంది.
వీటితో పాటు క్యారెట్, మెలకెత్తిన గింజలు, కాకర, పెరుగు, ఆరెంజ్, ద్రాక్ష, జామ వంటి పండ్లను తరచూ తీసుకుంటే ఆక్సిజన్ లెవల్స్ పెరగటానికి దోహదపడతాయి. మరీ, ఇక ఆలస్యం ఎందుకు డైలీ డైట్‌లో వీటిని తీసుకుని మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి.
Read Also : Kajal Aggarwal Baby Bump : కాజల్ అగర్వాల్ బేబీ బంప్‌పై ట్రోల్స్.. సమంత, హన్సిక, మంచు లక్ష్మీ ఇచ్చిపడేశారు..!
Tufan9 Telugu News providing All Categories of Content from all over world