Jobs in Telangana : తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. కేవలం డిగ్రీ పాసైతే చాలు.. ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవచ్చు. ఉద్యోగం వస్తే.. నెలకు రూ.25వేల నుంచి రూ.56వేల వరకు వేతనాన్ని పొందవచ్చు. ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (Employees’ State Insurance Corporation) పలు ప్రాంతాల్లో కొత్త పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది.
తెలంగాణలో హైదరాబాద్ రీజియన్‌లో అప్రర్ డివిజన్ క్లర్క్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (Multi Tasking Staff), స్టెనోగ్రఫర్ (stenographer jobs in telangana) పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవడానికి గరిష్ట వయసు 27ఏళ్లు ఉండాలి. అప్లికేషణ్ ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ పద్ధతిలోనే ఉంటుంది. దరఖాస్తులు జనవరి 15, 2022న ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 15, 2022న అప్లికేషన్ చివరి గడువు తేదీ… అంటే.. సరిగ్గా మరో వారం మాత్రం సమయం ఉంది.
ఈలోగా అప్లయ్ చేసుకున్నవారికే ఉద్యోగం దక్కే అవకాశం దొరకుతుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,000 నుంచి రూ.56,000 వరకు వేతనం అందించనున్నారు. ఇక ఉద్యోగ నోటఫికేషన్ వివరాలు, అప్లికేషన్ ప్రక్రియ కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.esic.nic.in/recruitments సందర్శించండి.
Jobs in Telangana – Posts Details & Eligibility : పోస్టులు – అర్హతలు ఇవే :
స్టనోగ్రఫర్ : 10వ తరగతి పాసై ఉండాలి. ఇంగ్లీష్ హిందీలో టైపింగ్ తెలిసి ఉండాలి. ఖాళీలు ( 04)
అప్పర్ డివిజన్ క్లర్క్ : గుర్తింపు పొందిన యూనివర్సిటీలో డిగ్రీ పాసై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఖాళీలు ( 25)
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ : గుర్తింపు పొందిన బోర్డులో టెన్త్ చదవి ఉండాలి. ఖాళీలు ( 43)
ఎంపిక చేసే విధానం..
* ముందగా అభ్యర్థుల నుంచి అప్లికేషన్
* రాత పరీక్ష నిర్వహిస్తారు.
రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
ఉత్తీర్ణులైన వారికి వెంటనే ఆయా పోస్టింగ్ ఇస్తారు.
దరఖాస్తు చేసే విధానం ఇలా..
అప్లికేషన్ ప్రాసెస్ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే..
* అధికారిక వెబ్‌సైట్ https://www.esic.nic.in/recruitments విజిట్ చేయండి.
* RO Hyderabad సెక్షన్‌లో నోటిఫికేషన్ చదవాలి. (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
* అర్హతలు ఉంటే అప్లయ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవసరమైన మీ డేటాను ఇవ్వాలి.
* దరఖాస్తు పూర్తి అయ్యాక రూ.500 పరీక్ష ఫీజు చెల్లించాలి.
* అప్లికేషన్ పూర్తై అయ్యాక (Submit) చేయాలి.
* అప్లికేషన్ ఫాం కాపీని ప్రింట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోవాలి. భవిష్యత్తులో అవసరం పడొచ్చు.
* అప్లికేషన్లు జనవరి 15, 2022న ప్రారంభమయ్యాయి.
* దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 15, 2022 వరకు మాత్రమే….
Read Also : Sreeja Kalyan : ఆ హీరోయిన్‌తో చనువుగా ఉండటం వల్లే శ్రీజ కళ్యాణ్‌కు విడాకులు ఇవ్వనుందా?
Tufan9 Telugu News providing All Categories of Content from all over world