Whatsapp : ఆ విషయంలో యూజర్లకు షాక్ ఇవ్వనున్న వాట్సాప్…

Whatsapp : ప్రస్తుతం నేటి కాలంలో చిన్నల నుంచి పెద్దల వరకు అందరికీ వాట్సాప్ గురించి తెలిసిందే. కాగా ప్రపంచవ్యాప్తంగా యూజర్లకు క్లౌడ్‌ స్టోరేజ్‌ను పరిమితం చేస్తూ గూగుల్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా యూజర్లు కేవలం 15 జీబీ వరకు మాత్రమే డేటాను క్లౌడ్‌లో స్టోర్‌ చేసేందుకు గూగుల్‌ అనుమతిస్తుంది. అంతకుమించి క్లౌడ్‌ స్టోరేజ్‌ కావాలంటే కచ్చితంగా కొంత రుసమును చెల్లించాల్సిందే. ఇప్పుడు గూగుల్‌ మరో ఎత్తుగడతో వాట్సాప్‌ యూజర్లకు షాక్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

సుమారు 2 బిలియన్లకు పైగా యూజర్లు వాట్సాప్‌ ను వినియోగిస్తున్నారు. వాట్సాప్‌లోని ఫోటో, ఆడియో, వీడియో, డాక్యుమెంట్లను బ్యాకప్‌ చేసుకొనే సౌకర్యాన్ని యూజర్లకు వాట్సాప్‌ యాప్‌ కల్పిస్తోంది. వాట్సాప్‌ యూజర్లకు బ్యాకప్‌ విషయంలో నియంత్రణను కల్పించేలా కొత్త బ్యాకప్‌ ఫీచర్‌పై వాట్సాప్‌ పనిచేస్తోంది. బ్యాకప్‌పై నియంత్రణ ఉంచడంతో యూజర్లకు నచ్చిన వాటిని బ్యాకప్‌ చేసుకొనే వీలు ఉంటుంది.

వాట్సాప్‌ బ్యాకప్‌ డేటా పూర్తిగా యూజర్‌ సంబంధిత గూగుల్‌ డ్రైవ్‌లో సేవ్‌ అవుతుంటుంది. బ్యాకప్‌ విషయంలో పరిమిత స్టోరేజ్‌ను వాట్సాప్‌ త్వరలోనే ప్రవేశ పెట్టనుంది. గత ఏడాది అక్టోబర్‌లోనే వాట్సాప్‌ చాట్‌ బ్యాకప్‌ డేటా పెయిడ్‌ స్టోరేజ్‌పై కథనాలు వచ్చాయి. అయితే అపరిమిత వాట్సాప్‌ బ్యాకప్‌ డేటాకు త్వరలోనే కాలం చెల్లనుంది.

Advertisement
whatsapp-taking-shocking-decision-about-storage-and-backup
whatsapp-taking-shocking-decision-about-storage-and-backup

వాట్సాప్‌ ట్రాకర్‌ WABetaInfo ప్రకారం… వాట్సాప్‌ చాట్స్‌ బ్యాకప్స్‌లో భాగంగా పలు మార్పులు త్వరలోనే రానున్నట్లు పేర్కొంది. ‘బ్యాకప్‌ లిమిట్‌’, గూగుల్‌ డ్రైవ్‌ బ్యాకప్‌ చేజింగ్‌, గూగుల్‌ డ్రైవ్‌ అల్‌మోస్ట్‌ ఫుల్‌, గూగుల్‌ డ్రైవ్‌ లిమిట్‌ రిచ్డ్‌ వంటి నోటిఫికేషన్స్‌తో యూజర్లను వాట్సాప్‌ అలర్ట్‌ చేసే అవకాశం ఉంది. ఇప్పటికైతే వాట్సాప్‌ చాట్‌ బ్యాకప్‌ పెయిడ్‌స్టోరేజ్‌పై ఎలాంటి సమాచారం లేదు. అయితే గూగుల్‌ డ్రైవ్‌లో అందించినట్లుగానే 15 జీబీ వరకు ఉచితంగా తరువాత స్టోరేజ్‌ కోసం 100 జీబీకు నెలకు రూ. 130 వసూలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel