Producer Dil Raju : 2021 సంక్రాంతికి రిలీజ్ కావల్సిన భారీ సినిమాలు కరోనా థార్డ్ వేవ్ కారణంగా భారీ చిత్రాలు వాయిదా పడిన విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా మల్టీస్టారర్ భీమ్లా నాయక్, సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రాలు ఉన్నాయి. వీటిలో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన ఎఫ్3 చిత్రం కూడా ఉంది. అయితే తాజాగా చిత్ర యూనిట్ ఎఫ్3 చిత్రాన్ని ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
కాగా తాజాగా దిల్‌రాజు మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగానే F3 సినిమా విడుదలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ… ‘వచ్చే నెల మూడో వారం నుంచి కరోనా తీవ్రత తగ్గి పెద్ద సినిమాల విడుదలకు మార్గం సుగమం అవుతుందనే ఆశిస్తున్నాం. కరోనా నేపథ్యంలో ‘RRR’
చిత్ర యూనిట్ రెండు విడుదల తేదీలను ప్రకటించింది. ఒకవేళ ఆర్ఆర్ఆర్ ఏప్రిల్ 28కి వాయిదా పడితే, ఎఫ్3 వాయిదా పడొచ్చు అని చెప్పుకొచ్చారు దిల్ రాజు. దీని కారణంగా పాన్ ఇండియా మూవీ అయిన ఆర్ఆర్ఆర్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని దిల్ రాజు అభిప్రాయపడ్డారు.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరల విషయమై ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరిలోపు పరిష్కారం లభిస్తుందనే నమ్మకంతో ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫార్సుల ఆధారంగా నిర్ణయాలు ఉంటాయని దిల్ రాజు అన్నారు. 2021 సంక్రాంతికి రావాల్సిన ఎఫ్3 కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. షూటింగ్‌లకు అంతరాయం కారణంగా రిలీజ్ డేట్ కూడా ప్రకటించడం లేట్ అయ్యింది. ఎట్టకేలకు పరిస్థితులు అనుకూలించి షూటింగ్ పూర్తి కాగా… ఈ సినిమాని 2022 ఏప్రిల్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఆర్‌ఆర్‌ఆర్ సినిమా కోసం ఎన్టీఆర్, మెగా అభిమానులు మూడేళ్లుగా వెయిట్ చేస్తున్నారు.
Read Also : Sai Pallavi Trolls : సాయిపల్లవి బాడీ షేమింగ్ ట్రోలర్లకు గట్టి క్లాస్ తీసుకున్న తెలంగాణ గవర్నర్..!
Tufan9 Telugu News And Updates Breaking News All over World