...

Guppedantha Manasu : కోపంతో రగిలిపోతున్న దేవయాని.. ఏకంగా వసును కాలితో తన్నుతూ!

Guppedantha Manasu Today Episode Jan 27 : బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. జగతి ఇంటికి వచ్చిన రిషి, మా డాడి సంతోషం కోసం, ఆనందం కోసం మీరు మా ఇంటికి రావాలని జగతితో అంటాడు. ఆ మాటతో జగతి మనసులో ఆనందం తో ఫీల్ అవుతుంది. ఇక రిషి, వసును కూడా ఇంటికి రమ్మంటాడు.

Advertisement
Guppedantha Manasu Today Episode Jan 27
Guppedantha Manasu Today Episode Jan 27

‘ఇప్పుడే మనం వెళ్తున్నాం బయలుదేరండి’ అని రిషి అడగగా.. జగతి ఎంతో ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత రిషి బయట కార్లు వెయిట్ చేస్తుంటాను త్వరగా రెడీ అవ్వండి అని చెప్పగా.. ఇక జగతి మనసులో ఆనందం వేరే స్థాయిలో పొంగిపోతుంది. మరోవైపు గౌతమ్, తన వదిన, దేవయాని లు ముగ్గురు కలిసి ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటూ తెగ హడావిడి చేస్తూ ఉంటారు.

Advertisement

ఈలోపు రిషి వాళ్ళ కారు రానే వస్తుంది. ఇక కారు దిగుతున్న జగతిని చూసి దేవయాని ఒక్కసారి గా స్టన్ అవుతుంది. అలా జగతి, వసు లను ఇంటికి తీసుకు వచ్చినందుకు గాను గౌతమ్, రిషిని ‘నువ్వు సూపర్ రా బంపర్ రా’ అంటూ పొగుడుతాడు. ఇక జగతిని రిషి ఇంటి లోకి తీసుకు వెళ్తూ ఉండగా.. దేవయాని కోపం వెయ్యి రెట్లు ఎక్కువ అవుతుంది.

Advertisement

Guppedantha Manasu : ఈరోజు ఎపిసోడ్‌లో జరిగేది ఇదే…

ఆ తర్వాత వసుధార మనసులో ‘జగతి మేడం ను ఇంటికి తీసుకు వచ్చినందుకు రిషి సార్ కి థాంక్స్ చెప్పాలి’ అని అనుకుంటుంది. జగతి అలా దేవయాని ఇంటి గడప తొక్కడాన్ని దేవయాని అస్సలు జీర్ణించుకోలేకపోతోంది. అలా ఇంటి లోకి వచ్చిన జగతి ‘సంక్రాంతి శుభాకాంక్షలు అక్కయ్య’ అని జగతి దేవయానికి వెటకారంగా చెబుతుంది.

Advertisement

ఆ తర్వాత దేవయాని ఒక గదిలోకి వెళ్లి జగతి, వసులను రిషి ఇంటికి తీసుకు రావడం ఏమిటి అని గట్టిగా అరుస్తుంది. తరువాయి భాగంలో బెడ్ రూమ్ లో ఉన్న మహేంద్ర, జగతి ని చూసి ఎంతో ఆనంద పడతాడు. ఇక అదే క్రమంలో రిషి, వసును గదిలోకి తీసుకు వెళుతూ ఉండగా దేవయాని కుట్రతో వసును కాళ్ల పై తన్నుతుంది. ఇక వసు నొప్పితో గట్టిగా అరుస్తుంది.

Advertisement

Read Also : Karthika Deepam: సౌర్యకు ఆపరేషన్.. టెన్షన్‌లో కార్తీక్.. దూరమవుతున్న సౌందర్య, ఆనందరావు!

Advertisement
Advertisement