Karthika Deepam: బాబును ఎత్తుకెళ్లిన రుద్రాణి.. కోపంతో రగిలిపోతున్న వంటలక్క!

Updated on: January 20, 2022

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ప్రకృతి వైద్యశాల లో సౌందర్య.. తమ గురించి ప్రకృతి వైద్యశాల కు ఎవరు వచ్చి ఉంటారని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన దీప అత్తమామల గురించి అదేవిధంగా ఆలోచిస్తూ ఉంటుంది. పిల్లలు ప్రేమగా మాట్లాడుతున్న.. నేను అలిసిపోయాను అంటూ బదులిస్తుంది.

మరోవైపు కార్తీక్ ప్రకృతి వైద్యశాల కు వెళతాడు. అక్కడికి వెళ్ళిన కార్తీక్ ఆ వైద్యశాలలో పనిచేసే ఒక వ్యక్తిని తన తల్లిదండ్రుల గురించి ఇన్ఫర్మేషన్ అడుగుతాడు. అప్పుడా వ్యక్తి.. వాళ్ళిద్దరూ మీకు ఏమవుతారు అని అడగగా కార్తీక్ నాకు ఏమీ కారు అని చెబుతాడు. దాంతో ఆ వ్యక్తి “వాళ్ళేదో హెల్త్ బాగోలేక ఇక్కడికి వచ్చారు. వాళ్లని ఎందుకు సార్ మీరు డిస్టర్బ్ చేయడం” అని ఆ వ్యక్తి అంటాడు.

దానికి కార్తీక్ వెంటనే తిరిగి వస్తాడు. మరో వైపు మోనిత తన కపట ఎత్తుగడలు వేసుకుంటూ తనకు తానే మురిసిపోతూ ఉంటుంది. ఆ తర్వాత సౌందర్య, ఆనంద్ రావ్ లు అదే పనిగా.. కార్తీక్ గురించి ఆలోచిస్తూనే ఉంటారు. ఆ తర్వాత కార్తీక్ అన్నం తినుకుంటూ “మమ్మీ డాడీ లు ప్రకృతి వైద్యశాల లో ఉన్న సంగతి దీపకు చెప్పాలా వద్దా” అని ఆలోచిస్తూ ఉంటాడు.

Advertisement

అక్కనే ఉన్న దీప కూడా “కార్తీక్ కు అత్తమామలు ఈ ఊళ్ళోనే ఉన్న సంగతి చెప్పాలా వద్దా” అని ఆలోచిస్తుంది. ఇక కార్తీక్.. రుద్రాణి ఇంటికి వెళ్లి పిల్లలకు భోజనం పంపించినందుకు వార్నింగ్ ఇచ్చిన సంగతి దీపకు చెబుతాడు. ఆ తర్వాత కార్తీక్, దీపని నువ్వు ప్రకృతి వైద్యశాలకు వెళ్ళావా అని అడగగా.. రుద్రాణి ని కొట్టిన ఆ మహానుభావురాలిని చూడడానికి వెళ్లాను కానీ ఆమె కనిపించలేదు అని చెబుతుంది.

ఆ తర్వాత రుద్రాణి ఎలా.. ఎత్తుకెలుతుందో కానీ బాబుని ఎత్తుకు వచ్చేస్తుంది. ఆ సంగతి తెలిసిన దీప, రుద్రాణి ఇంటికి బయలుదేరి ఓ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో రుద్రాణి ఇంటి ముందు గేట్లు తెరుస్తుంది. లోపలికి వెళ్లి బాబుని తీసుకువచ్చినందుకు కడిగేస్తుంది. దానికి రుద్రాణి “అంత పౌరుషం ఉంటే అప్పు కట్టి బాబుని తీసుకెళ్లు” అని ఒక్క మాటతో దీపకు బ్రేక్ ఇస్తుంది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel