...

ఏటీఎం కార్డు తో గొంతు కోసుకున్న యువకుడు.. కారణం ఏంటో తెలిస్తే షాక్.?

మనకు ఏటీఎం కార్డు ఇప్పటివరకు డబ్బులు తీసుకోవడానికే వాడతారని తెలుసు. కానీ అదే ఏటీఎం గొంతు కూడా కోసింది. మరి యదార్థ సంఘటన ఎక్కడ జరిగింది.. దాని వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకుందామా..? ఒక 53 సంవత్సరాల మహిళ భయం భయంతో వణికిపోతూ రోడ్డుపై పరిగెత్తుకుంటూ వస్తోంది. ఎవరైనా సహాయం చేస్తారు అనుకుని బిక్కు బిక్కు మంటూ చూస్తుంది. ఇదే సమయంలో ఆ వైపుగా పోలీసు వాహనం వచ్చింది. దీంతో సదరు మహిళ ఏమాత్రం లేట్ చేయకుండా వాహనానికి ఎదురుగా వెళ్లి ఆ వాహనాన్ని ఆపింది.

Advertisement

Advertisement

పోలీసులకి ఏం జరిగిందో చెప్పింది. ఆమె చెబుతున్న టువంటి మాటలు పూర్తికాకుండానే పోలీసులు అపార్ట్మెంట్ వైపు చాలా స్పీడ్ గా వెళ్లి ఆ ఫ్లాట్ తలుపులను పగలగొట్టారు. తీరా చూస్తే రక్తపుమడుగులో యువకుడు పడి ఉన్నాడు. మరి ఆ యువకుడు ఎందుకు చనిపోయాడు. ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు..? పూర్తి వివరాల్లోకి వెళితే చెన్నై శివార్లలోని పేరవల్లూరు ప్రాంతంలో ఈ సంఘటన సోమవారం సాయంకాల సమయంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన అసలు విషయాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. పాండిచ్చేరి చెందినటువంటి 25 సంవత్సరాల యువకుడు అరవిందను 2018లో చెన్నై నగరంలోని ఓ ప్రైవేటు యూనివర్సిటీలో పీజీ చదివాడు. ఆ సమయంలోనే అతనికి ఒక అమ్మాయి పరిచయమైంది. వారిద్దరూ క్లాస్మేట్స్ కావడంతో వారి మధ్య బాగా చనువు పెరిగిపోయింది. ప్రతి విషయాన్ని ఇద్దరు షేర్ చేసుకునే వారు. దీంతో అమ్మాయిపై యువకుడికి ప్రేమ ఏర్పడింది. ఆమె ఏం కావాలని అడిగిన కాదనకుండా ఇచ్చేసేవాడు. అతని అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్నా యువతి యువకుడి నుంచి 3.5 లక్షల రూపాయలను సహాయంగా తీసుకుంది.

Advertisement

ఆ తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తానని కూడా చెప్పింది. ఇంతలో కాలేజి కూడా పూర్తయింది. అయినా వారి మధ్య పరిచయం కొనసాగుతూ వచ్చింది. కానీ డబ్బులు మాత్రం తిరిగి రాలేదు. అరవిందను ఇంట్లో డబ్బులు ఏమయ్యాయని వారి తల్లిదండ్రులు అడిగారు. దీంతో ఆ యువకుడు అమ్మాయిపై డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చాడు. ఇక అప్పటి నుంచి అతన్ని ఆ యువతి దూరం పెట్టడం మొదలు పెట్టింది. ఎన్నిసార్లు ఫోన్ కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఆ యువకుడు నేరుగా ఆమె ఇంటికి వెళ్లాడు. వీళ్ళు ఇద్దరు స్నేహితులు గా ఉన్నప్పుడు పెరవల్లూరు ఆమె ఇంటికి యువకుడు అప్పుడప్పుడు వెళ్లేవాడు. తెలిసిన ఇల్లే కాబట్టి సోమవారం కూడా ఆమె ప్లాంట్ ఇక నేరుగా వెళ్లి తలుపు కొట్టాడు యువకుడు. అతను ఎందుకు వచ్చాడో ముందే తెలుసుకున్నటువంటి యువతి అతను ఎవరో తెలియనట్లు నటించింది. దీంతో ఆ డోర్ వద్ద గొడవ జరిగింది. లోపలికి రావద్దని డోర్ వేయబోయింది. కానీ ఈ యువకుడు ఆమెను తోసుకుంటూ లోపలికి వెళ్లాడు. దీంతో ఆ యువతి అయ్యో ఇంట్లోకి దొంగ వచ్చాడ ని గట్టిగా కేకలు వేసింది. భయపడ్డ యువకుడు వెంటనే వారి ఇంట్లోనే ఒక గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. తర్వాత తన దగ్గర ఉన్నటువంటి ఏటీఎం కార్డుతో గొంతు కోసుకున్నాడు. వెంటనే వచ్చిన పోలీసులు ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement