Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుకుందాం. మహేంద్రను హాస్పిటల్ లో అడ్మిట్ చేసిన తర్వాత జగతి కంటతడి పెట్టేస్తుంది. దానికి వసుధార ధైర్యం చెబుతుంది. ఈలోపు రిషి హాస్పిటల్ కు రానే వస్తాడు. గౌతమ్ ను ఏం జరిగిందని ఎంత అడిగినా చెప్పడు.
తర్వాత రిషి సరాసరి వసుధార దగ్గరికి వస్తాడు. పక్కనే ఉన్న జగతి బాగా ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన రిషికు పిచ్చెక్కినట్టుగా ఉంటుంది. అసలు ఏం జరిగిందని వసుధార ను అడుగుతాడు. ఇక వసుధార కూడా రిషి ఎంత అడిగినా ఏం జరిగిందో అసలు చెప్పదు. దీనికి అసహనం వ్యక్తం చేసిన రిషి గట్టిగా అరుస్తాడు. ఇక వసు జరిగిన సంగతి చెప్పేస్తుంది. నిజం తెలిసిన రిషికి ఒక్కసారిగా కుప్పకూలిన అంత పని అవుతుంది.
ఆ తర్వాత మరో రూమ్ కి షిఫ్ట్ చేస్తున్న మహేంద్ర ను చూసి రిషి ‘మా డాడ్ కి ఏమైంది’ అంటూ ఏడుస్తాడు. డాక్టర్ లు హార్ట్ స్ట్రోక్ అని చెప్పి వేరే రూమ్ కి షిఫ్ట్ చేస్తారు. తరువాత రిషి తన తండ్రి రూమ్ కి వెళతాడు. వెళ్లి అక్కడ మహేంద్ర ని చూస్తూ ఇదివరకు జరిగిన తీపి జ్ఞాపకాల గురించి ఆలోచించు కుంటూ.. బాధపడతాడు. జగతి అదేవిధంగా కంటతడి పెడుతూనే ఉంటుంది.
ఆ తర్వాత రిషి ‘చలాకీగా నవ్వుతూ ఉండే మీరు బెడ్ మీద ఉండటం నాకు నచ్చలేదు డాడీ’ అంటూ తెగ బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత కొంత సేపటికి మహేంద్రకు సృహ వస్తుంది. అలా సృహ రావడంతో రిషి, జగితిలు ఇద్దరికి ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నంత పని అవుతుంది. సృహ లోకి వచ్చిన మహేంద్ర ‘ఏంటి.. భయపడ్డారా నాకేమీ కాదు’ అంటూ నవ్వుతూ చెబుతాడు.
తరువాయి భాగం లో మహేంద్ర దగ్గరకు వసుధార వచ్చి రిషి ఎంత బాధ పడ్డాడో.. మహేంద్ర కు చెబుతుంది. దానికి మహేంద్ర ‘ఇన్నాళ్లు వాడి మనసులో దాచుకున్న కన్నీళ్లు ఈ విధంగా అయినా బయట పడ్డాయి’ అని అంటాడు. అంతేకాకుండా వసుధారతో జగతి, రిషి లను కలిపి జగతికి రిషిని గురుదక్షిణగా ఇచ్చే బాధ్యత నీదే అని మాటిచ్చావు అంటూ గుర్తు చేస్తాడు. మరోవైపు జగతి మహేంద్ర గురించి మాట్లాడటంతో రిషి ఈ విషయం ను అనుకూలంగా తీసుకోకండి అంటూ షాక్ ఇస్తాడు.
- Guppedantha Manasu Aug 19 Today Episode : రిషికి రింగు చేయించాలి అనుకున్న వసు..ఒకే కారులో జగతి దంపతులు వసు,రిషి..?
- Guppedantha Manasu జనవరి 28 ఎపిసోడ్ : రిషిని హత్తుకొని ఎమోషనల్ అయిన మహేంద్ర.. రిషిని రెచ్చగొడుతున్న దేవయాని?
- Guppedantha Manasu November 26 Today Episode : రిషిని కలవరిస్తున్న జగతి.. తల్లికి సేవలు చేస్తున్న రిషి?













