...

బ్లాక్ బెర్రీ ఈజ్ కమ్ బ్యాక్.. ఈసారి 5G ఫోన్ పక్కా వచ్చేస్తోందట..!

బ్లాక్ బెర్రీ.. ఈ ఫోన్లకు ఉన్న క్రేజే వేరు.. ప్రపంచ మొబైల్ మార్కెట్లో అంతగా పాపులర్ అయ్యాయి. ఈ ఏడాదిలో 5G సపోర్టుతో బ్లాక్ బెర్రీ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. అప్పట్లో ఈ ఫోన్ ని ఎగబడి మరీ కొనేవారు. ఆ తర్వాత పోను పోనూ బ్లాక్ బెర్రీ ఫోన్ లు కనిపించకుండా పోయాయి. బ్లాక్ బెర్రీ ఫోన్ ఇక లేదు అనుకున్న తరుణంలో.. ఇప్పుడు మళ్ళీ ఐకానిక్ బ్లాక్ బెర్రీ ఫోన్ లు రీ ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఐకానిక్ బ్లాక్ బెర్రీ రియు 2022 లో ఎంట్రీ ఇవ్వనుందని టెక్సాస్ సొల్యూషన్స్ స్టార్టప్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఏడాదిలో 5G సపోర్టుతో బ్లాక్బెర్రీ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనున్నట్టు తెలిపింది. ఆలస్యం కావచ్చు కానీ.. రావడం మాత్రం పక్క అంటోంది.

Advertisement

Advertisement

దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురానున్నట్టు 2020 లోని టెక్సాస్ సంస్థ,ఆన్ వర్డ్ మొబిలిటీ ప్రకటించింది. 2021లో 5G స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసేందుకు రెడీ అయ్యింది. కానీ ఆ సంవత్సరంలో ఎదురైన సవాళ్లతో అనుకున్నట్టుగా కొత్త బ్లాక్ బెర్రీ స్మార్ట్ ఫోన్ తీసుకురావడం జరగలేదని తెలిపింది. ఈ ఏడాది మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆన్ వర్డ్ మొబిలిటీ ఒక ప్రకటనలో తెలిపింది.Black Berry 10 OS లేదా అంతకు ముందు రన్ అయ్యే అని క్లాసిక్ స్మార్ట్ ఫోన్ లకు సపోర్ట్ నిలిపివేసింది. అనంతరం బ్లాక్ బెర్రీ స్మార్ట్ ఫోన్ కంపెనీ మూసివేస్తుందనే వార్తలు చక్కర్లు కొట్టాయి.5G కనెక్టివిటీ తో బ్లాక్ బెర్రీ స్మార్ట్ ఫోన్ ను 2022 ఏడాదిలో రిలీజ్ చేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది. రాబోయే కొత్త 5G బ్లాక్ బెర్రీ స్మార్ట్ ఫోన్ కీబోర్డ్ తో రానుంది.

Advertisement

ఈ 5Gఫోన్ ఆండ్రాయిడ్ ఆధారంగా రూపొందించింది.ఫిజికల్ కీబోర్డ్, 5G కొత్త బ్లాక్ బెర్రీ ఫోన్ ఎంటర్ ప్రైజ్- ఫోకస్డ్ సెక్యూరిటీ ఫీచర్లను కూడా యాడ్ చేస్తోంది. ఉత్తర అమెరికా, యూరప్ లలో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని గతంలోనే వెల్లడించింది. కొత్త ఫోన్ కు సంబంధించి స్పెసిఫికేషన్ల వివరాలను కంపెనీ రివీల్ చేయలేదు. ఈ ఫోన్ కీబోర్డ్ తో వస్తుందని మాత్రమే ప్రకటించింది. ప్రస్తుతానికి కంపెనీ ఫోన్ పేరు, స్పెసిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

Advertisement
Advertisement