...

పుట్టింటికి వెళ్ళిన భార్య..అత్తపై దాడి చేసి చెవి కోసిన అల్లుడు..

తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి అత్త పై కత్తితో దాడి చేసి చెవి కోసేశాడు. అడ్డువచ్చిన భార్యను సైతం గాయపరిచాడు. ఈ ఘటన ఆదోని లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని మరాఠగేరి కి చెందిన మాధవి.. నిజమొద్దీన్ కాలనీకి చెందిన నరేష్ కుమార్ ఎనిమిది నెలల క్రితం ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. తర్వాత తాగుడుకు బానిసైన భర్త డబ్బు కోసం ఆమెను వేధించేవాడు. భర్త వేధింపులను భరించలేక మాధవి తన భర్తను వదిలి తల్లి సావిత్రమ్మ వద్దకు వెళ్ళింది.

Advertisement

Advertisement

భార్య పుట్టింటికి వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేని నరేష్ కుమార్ అత్త ఇంటికెళ్లి కత్తితో దాడికి పాల్పడ్డాడు.ఈ ఘటనలో సావిత్రమ్మ ఎడమచెవి సగం తెగిపోయింది. అడ్డు వచ్చిన భార్య పై కూడా దాడికి పాల్పడ్డాడు. బాధితుల ఏడుపులు విని ఇరుగు పొరుగువారు రావడంతో నరేష్ కుమార్ అక్కడి నుండి పరారయ్యాడు. అక్కడ జరిగిన ఘటనపై మాధవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు

Advertisement

. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.తనను బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకోవడమే కాకుండా వివాహ సమయంలో తీసుకెళ్లిన ఎనిమిది లక్షల రూపాయలు, 20 తులాల బంగారం తాగుడుకు ఖర్చు చేసి మళ్ళీ ఇప్పుడు ఇంకొంచెం డబ్బు తీసుకురావాలని వేధిస్తున్నాడని మాధవి విలపించారు.

Advertisement
Advertisement