Google Chrome : గూగుల్ క్రోమ్ అప్ డేట్ చేశారా? లేదంటే అంతే సంగతులు..

Updated on: April 30, 2022

Google Chrome : కంప్యూటర్, ల్యాబ్‌టాప్ వాడేవారు ఎప్పుటికప్పుడు గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను అప్ డేట్ చేస్తున్నారా? చేయకుంటే ఏమౌతుంది. చేస్తే వచ్చే లాభాలేంటి అనే విషయాలను కేంద్ర ప్రభుత్వ టీం వివరించింది. గూగుల్ క్రోమ్ యూజ్ చేసే వారు వెంటనే వాటిని అప్ డేట్ చేయాలని సూచించింది. లేదంటే మలిషియస్ వైరస్ ద్వారా సైబర్ నేరగాళ్లు ఎటాక్ చేసే ఛాన్స్ ఉంది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వ టీం హెచ్చరికలు జారీ చేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ టీం పనిచేస్తున్నది. యాప్స్ అప్ డేట్‌పై కొన్ని కీలక సూచనలు చేసింది. లేదంటే సైబర్ నేరగాళ్ల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరించింది.

97.0.4692.71 కంటే పాత వెర్షన్ వాడుతున్న వారు వెంటనే దానిని అప్ డేట్ చేసుకోవాలని సూచించింది. ఇందుకు ఉదాహరణగా ఇటీవల జరిగిన సైబర్ దాడులను చెప్పుకొచ్చింది. ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవడం వల్ల ఎవైనా లోపాలుంటే అవి పరిష్కారమవుతాయని తెలిపింది. దీంతో పాటుగా కంప్యూటర్స్, ల్యాప్‌ట్యాప్‌ను నియంత్రించడం సైబర్ నేరగాళ్లకు సాధ్యపడదని వెల్లడించింది.

google-chrome-needs-to-be-updated
google-chrome-needs-to-be-updated

మొబైల్స్ లోని గూగుల్ క్రోమ్ తో పాటు ఇతర యాప్స్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ ఉండాని సూచించింది. లేదంటే హ్యారర్ల చేతికి చిక్కే ప్రమాదముందని హెచ్చరించింది. దీనికి తోడు గుర్తు తెలియన మెయిల్స్, లింకుల జోలికి వెళ్లకూడదని సూచించింది. లేదంటే సైబర్ నేరగాళ్ల చేతికి తాళాలు ఇచ్చినట్టే అవుతుంది. అంతేగా మరి.. యాప్స్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవడం వల్ల పాత సమస్యలు పరిష్కారం అయ్యే చాన్స్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీ ల్యాబ్ టాప్, కంప్యూటర్, మొబైల్‌లో యాప్స్ ను వెంటనే అప్ డేట్ చేయండి.

Advertisement

Read Also : Google Search: గూగుల్ సెర్చ్ లో మీ ఫోన్ నెంబర్ ఉందా… అయితే ఫోన్ నెంబర్ ఈజీగా తొలగించుకోవచ్చు?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel