Vanasthalipuram : గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురి అయిన కేసును వనస్థలిపురం పోలీసులు ఛేదించారు. ఓ వ్యక్తిని హత్య చేసి దుప్పట్లో చుట్టి నిర్మానుష్య ప్రదేశంలో పడేశారు. అయితే, ఆ వ్యక్తి హత్య కేసును పోలీసులు విచారించి వివరాలు తెలుసుకున్నారు. వివరాల్లోకెళితే..నల్గొండ జిల్లా బొమ్మకల్ గ్రామానికి చెందిన చిట్టి అనే 27 ఏళ్ల మహిళకు పెళ్లి అయింది.
అయితే, పలు కారణాల రీత్యా భర్తకు విడాకులు ఇచ్చి మరో వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. అతడు గతేడాది కరోనాతో మరణించాడు. దాంతో చిట్టి మిర్యాలగూడకు వెళ్లింది. అయితే, చిట్టి యోగక్షేమాలను రెండో భర్త స్నేహితుడు చూసేవాడు. సూర్యపేటకు చెందిన చిట్టి యోగక్షేమాలు చూస్తుండేవాడు.
ఈ సంగతులు అలా ఉంచితే మిర్యాలగూడలో ఒంటరిగా ఉంటున్న క్రమంలో చిట్టికి హైదరాబాద్‌లోని ఫిలింనగర్ కు చెందిన కుమార్ అనే 22 ఏళ్ల అబ్బాయితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం షేర్ చాట్ యాప్ ద్వారా జరిగింది. అతి కొద్ది టైంలో పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. దాంతో వనస్థలిపురం కమలానగర్ కాలనీకి చిట్టి మకాం మార్చింది.
అలా మరో వ్యక్తితో చిట్టిసంబంధం పెట్టుకుంది. గత ఏడాది డిసెంబర్‌లో భర్త ప్రియాంక ఇంటికి రాగా, ఇంటిలోపల చిట్టితో పాటు కుమార్ కనిపించాడు. అది చూసి గొడవపడ్డాడు శ్రీనివాస్. దాంతో కుమార్ చిట్టి కలిసి ఇంట్లోనే రొకలిబండతో తల మీద బలంగా కొట్టాడు. ఈ విషయాన్ని చిట్టి తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మరో వ్యక్తికి తెలిపింది.
అతడి సూచన మేరకు శ్రీనివాస్ డెడ్ బాడీని దుప్పట్లో పెట్టి విజయపురి కాలనీ బస్టాప్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి పడేశారు. ఘటనా స్థలంలో ఎటువంటి ఆధారాలు లభించలేదు. కాగా, మృతుడి జేబులో ఉన్న ఏటీఎం ఆధారంగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Read Also : Sri Reddy : నన్ను దాటుకునే జగన్ జోలికి వెళ్లాలి.. ఆర్జీవీపై శ్రీరెడ్డి ఫైర్..