Actress Sneha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్నేహ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. హోమ్లీ క్యారెక్టర్స్ ప్లే చేయడంతో పాటు స్టార్ హీరోయిన్ ఫేమ్ సంపాదించుకున్న..ఈమె.. టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన దాదాపుగా హీరోయిన్ యాక్ట్ చేసింది. తన అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ఈమెకు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఎక్కడంటే?
గ్లామరస్ రోల్స్ ప్లే చేసినప్పటికీ స్నేహకు క్లాస్ పాత్రలతోనే మంచి పేరు వచ్చిందని చెప్పొచ్చు. ‘ప్రియమైన నీకు, శ్రీరామదాసు’ వంటి చిత్రాల్లో స్నేహకు మంచి గుర్తింపు వచ్చింది. తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తోంది. ఇటీవల ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ కీలక పాత్రలు పోషిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ‘వినయ విధయ రామ’ చిత్రంలో రామ్ చరణ్‌కు వదినగా నటించింది. స్నేహ నటుడు ప్రసన్నను మ్యారేజ్ చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సంగతులు అలా ఉంచితే.. స్నేహకు కేరళలో ఒకసారి చేదు అనుభవం ఎదురైంది.
కేరళలోని తిరుచ్చి సిటీలో ఓ షాపు ఓపెనింగ్‌కు వెళ్లింది స్నేహ. కాగా, ఆమెను చూసేందుకుగాను అభిమానులు తరలివచ్చారు. ఈ క్రమంలో అందరి ముందరే తన నడుమును ఎవరో గిల్లారని స్నేహ గట్టిగా అరిచింది. ఈ క్రమంలోనే ఆ నిందను తన పక్కనే ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి సురేశ్‌పై మోపింది. దాంతో అక్కడున్న అభిమానులు, కొందరు యువకులు సురేశ్‌ను చితకబాదారు.
ఆ తర్వాత అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. అతను కొంతకాలం తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు. కాగా, తన భర్త స్నేహ నడుము గిల్లలేదని, స్నేహ పొరపాటు పడిందని, ఎవరో గిల్లితే తన భర్తను బలి చేసిందని రియల్ ఎస్టేట్ వ్యాపారి సురేశ్ భార్య స్నేహపై పరువు నష్టం దావా వేసింది. అయితే, ఈ విషయమై తర్వాత ఏం జరిగిందనేది తెలియరాలేదు.
Read Also : 2022లో రానున్న కొత్త మూవీలు ఇవే..!
Tufan9 Telugu News providing All Categories of Content from all over world