...

Singer Mangli Fans : అందరూ వెళ్లిపోవాలె.. ఫ్యాన్స్‌పై మంగ్లీ సిరియస్.. దరిద్రుడా అంటూ దూషణ.. వైరల్ వీడియో..

Singer Mangli Fans : తన గాత్రంతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టిన సింగర్ మంగ్లీ జానపద పాటలతో కెరీర్‌ స్టార్ట్ చేసింది. ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాల్లో పాటలు పాడిన మంగ్లీ.. శ్రోతల ఫేవరెట్ సింగర్ అయిపోయింది. జానపద పాటలతో పాటు సినిమా పాటల్లోనూ తనదైన శైలి ముద్రను వేసుకుంది సింగర్ మంగ్లీ. ఈమెకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ బిజయెస్ట్ సింగర్‌గా ప్రజెంట్ మంగ్లీ ఉంది. ‘మాటకారి మంగ్లీ’గా ఓ న్యూస్ చానల్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన ఆ తర్వాత జాన పద పాటలు పాడి గుర్తింపు తెచ్చుకుంది.

Advertisement

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్- బన్నీ ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో ‘రాములో రాములా’ పాట పాడిన మంగ్లీ.. ఆ పాట ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినీ పాట యూట్యూబ్‌లో ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇకపోతే ఈమె ‘లవ్ స్టోరి’ ఫిల్మ్‌లో పాడిన ‘సారంగదరియా’ సాంగ్ కూడా బాగా పాపులర్ అయింది.

Advertisement
Singer Mangli loses temper on Fans after getting mobbed in Andhra Ongole (1)
Singer Mangli loses temper on Fans after getting mobbed in Andhra Ongole

Singer Mangli Fans Ongole : మంగ్లీకి ఫ్యాన్స్ సెగ సినిమా పాటలతో పాటు ప్రత్యేక గీతాలనూ మంగ్లీ ఆలపిస్తోంది. ‘బతుకమ్మ, బోనాలు, వినాయక చవతి, మహా శివరాత్రి, సంక్రాంతి’ పండుగల సందర్భంగా ప్రత్యేక గీతాలు పాడి, అందులో నటించి ప్రేక్షకుల మన్ననలనూ మంగ్లీ పొందుతోంది. ఈ సంగతులు అలా ఉంచితే.. తాజాగా మంగ్లీకి ఫ్యాన్స్ సెగ తగిలింది.

Advertisement

వివరాల్లోకెళితే.. ఏపీలోని ప్రకాశం డిస్ట్రిక్ట్ యర్రగొండపాలెంలో ఓ మంత్రి కూతురు వివాహానికి వెళ్లింది మంగ్లీ. అక్కడ సింగర్ మంగ్లీతో సెల్ఫీలు దిగేందుకుగాను అభిమానులు ఎగబడ్డారు. దాంతో వారిపై మంగ్లీ ఆగ్రహం వ్యక్తం చేసింది. యువకుల తీరు అస్సలేం బాగలేదని మండిపడింది మంగ్లీ. యువకుల ఫోన్లు పగులగొట్టండి అని సీరియస్ అవడంతో పాటు ఓ యువకుడిని దరిద్రుడా అని దూషించింది మంగ్లీ. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

Advertisement

Read Also : Samantha : ఆ హీరోను ఇక ఎప్పుడూ నమ్ముతా.. సమంత సెన్సేషనల్ పోస్ట్..

Advertisement
Advertisement