Colours Swathi : భర్త ఫొటోలు డిలీట్ చేసిన తెలుగు హీరోయిన్.. విడాకుల తీసుకోబోతుందా ఏంటి? ఆమె ఎవరంటే?

Colours Swathi : ప్రస్తుత రోజుల్లో సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకునేవారి సంఖ్య పెరిగిపోతోంది. సెలబ్రిటీల కాపురాలు నీటి మీద బుడగలా మారిపోతున్నాయి. ఇందులో చాలావరకూ తమ …

Read more

Updated on: August 4, 2025

Colours Swathi : ప్రస్తుత రోజుల్లో సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకునేవారి సంఖ్య పెరిగిపోతోంది. సెలబ్రిటీల కాపురాలు నీటి మీద బుడగలా మారిపోతున్నాయి. ఇందులో చాలావరకూ తమ వివాహ బంధానికి సంబంధించి అధికారికంగా బయటపెట్టడం లేదు.. కానీ, గుట్టుగా తమ రిలేషన్‌పిప్ గురించి దాచేస్తున్నారు. మరికొందరు బ్రేకప్ విషయాన్ని హింట్ ఇస్తున్నారు. సోషల్ మీడియా అకౌంట్లలో తమ భాగస్వామితో కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలను డిలీట్ చేయడం ద్వారా హింట్ చేస్తున్నారు. చివరికి విడాకులంటూ సడన్ షాక్ ఇస్తున్నారు.

లేటెస్టుగా మరో నటి కూడా విడాకులు తీసుకోబోతున్నట్టుగా హింట్ ఇచ్చింది. ఆ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో కాదు.. కలర్స్ స్వాతి (Colours Swathi). అప్పట్లో కెరీర్ బాగా పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు పెళ్లితో సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. కలర్స్ ప్రొగ్రామ్‌తో బాగా ఫేమస్ అయిన కలర్స్ స్వాతి.. డేంజర్, అష్టాచెమ్మా మూవీల్లో నటించి హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

విక్టరీ వెంకటేష్ మూవీ ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ మూవీలో త్రిష చెల్లెలిగా నటించి మెప్పించింది. హీరో నిఖిల్ మూవీల్లో కార్తికేయ, స్వామి రారా, త్రిపుర, గోల్కొండ హైస్కూల్ , లండన్ బాబు మూవీల్లో కూడా నటించి తనదైన నటనతో ఆకట్టుకుంది. కారణాలు ఏదైనా కావొచ్చు.. ఇటీవల డివోర్స్ తీసుకునే వారు ఎక్కువగానే ఉన్నారు.

Advertisement

Colours Swathi : పైలట్ వికాస్ వాసును పెళ్లాడిన కలర్స్ స్వాతి :

సినీ కెరీర్ మంచి పీక్స్‌‌లో ఉన్న సమయంలోనే కేరళకు చెందిన పైలట్ వికాస్ వాసును 2018లో కలర్స్ స్వాతి వివాహం అయింది. పెళ్లైన తర్వాత కొన్ని సంవత్సరాలకు ఇరువురి మధ్య గొడవలు, మనస్పర్థలు వచ్చినట్టుగా జోరుగా ప్రచారం జరిగింది. 2023లో వచ్చిన మంత్ ఆఫ్ మధు మూవీ ప్రమోషన్స్ సందర్భంగా తన భర్త విషయం అడిగితే స్వాతి చెప్పనని స్పష్టం చేసింది. మరోసారి స్వాతి విడాకుల గురించి సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.

దీనిక కారణం.. ఆమె తన సోషల్ మీడియా అకౌంట్లలో పెళ్లి ఫొటోలతో పాటు భర్తకు సంబంధించిన ఫోటోలన్నింటినీ డిలీట్ చేసేసింది. దీంతో స్వాతి ఇన్‌డైరెక్టుగా విడాకులపై హింట్ ఇచ్చేసిందని అంటున్నారు. మరి ఇది నిజమో? అబద్ధమో తెలియాలంటే స్వాతి లేదా ఆమె భర్తయినా నోరు విప్పాలి. ఇన్నాళ్లకు కలర్స్ స్వాతి విడాకుల విషయంలో మరోసారి సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. తన సోషల్ అకౌంట్‌లో భర్తతో దిగిన పెళ్లి ఫోటోలన్నింటినీ స్వాతి డిలీట్ చేయడంతో ఈ పుకార్లకు మరింత బలానిచ్చింది. అయితే, స్వాతి తన భర్తతో విడిపోయినట్టుగా ఇలా హింట్ ఇచ్చి ఉంటుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Read Also : Airtel Jio : జియో, ఎయిర్‌టెల్ కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. ఇకపై మొబైల్ డేటాకు డబ్బులు కట్టనక్కర్లేదు..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ సబ్ ఎడిటర్‌గా ఉన్నాను. బ్రేకింగ్ న్యూస్, తెలంగాణ , ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, స్పోర్ట్స్, హెల్త్, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, మూవీలు, బిజినెస్ వార్తలను రాస్తుంటాను.

Join our WhatsApp Channel