Laxmi Raai : అసలు ఎంఎస్ ధోని నేను ఎందుకు విడిపోయామంటే..? లక్ష్మీ రాయ్ సంచలన కామెంట్స్

Laxmi Raai : లక్ష్మీ రాయ్ ఒక మోడల్, సినీ యాక్టర్ అని అందరికీ తెలుసు. ఈ పొడుగు కాళ్ల సుందరి ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ సినిమాల్లో కూడా చిత్రాలు చేసింది. అయితే, లక్ష్మీరాయ్ ఒకప్పుడు క్రికెటర్ ఎం ఎస్ ధోనితో రిలేషన్‌లో ఉందని మీలో ఎవరికైనా తెలుసా.. తాజాగా ఈ హాట్ సుందరి తనకు ధోనికి మధ్య రిలేషన్ చెడిపోవడానికి గల కారణాలను బహిర్గతం చేసింది. ఉన్నట్టుండి ధోని తనకు ఎందుకు దూరమయ్యాడు. వెంటనే ధోని ఎందుకు సాక్షిని పెళ్లి చేసుకున్నాడు.. లక్ష్మీ రాయ్ ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదో కూడా వివరించింది.

టీ ఇండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ఇండియాలోనే కాదు ప్రపంచంలోని క్రికెట్ అభిమానులను ఎవరిని అడిగినా తెలుసనే చెబుతారు. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు.. క్రికెట్‌ ప్రపంచంలో తన అసాధారణ ప్రతిభతో దేశానికి మూడు ప్రపంచ కప్పులు అందించాడు. 2011 వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, ఆసియా చాంపియన్స్ ట్రోఫీలను అందించాడు. ఇండియన్ క్రికెట్‌ జట్టులో అత్యుత్తమైన ఆటగాళ్లలో ధోని ఒకరు. జట్టుకు ఎన్నో సేవలు, విజయాలు అందించాడు.

ధోని సాక్షిని పెళ్లి చేసుకోకముందు హీరోయిన్ లక్ష్మీరాయ్‌తో కొన్నేళ్లు తిరిగాడు.. వీరిద్దరూ లవ్‌లో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఐపీఎల్ టైంలో ధోని, లక్ష్మీరాయ్ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు.ల‌క్ష్మీరాయ్ ఇచ్చిన పార్టీల‌కు, బ‌ర్త్‌డే వేడుకలకు కూడా హాజరయ్యాడు. కానీ ఏం జరిగిందో తెలీదు అనుకోకుండా వీరిద్దరూ విడిపోయారు. దీనిపై తాజాగా లక్ష్మీరాయ్ నోరు విప్పింది.

Advertisement

మనస్పర్ధల కారణంగానే ఇద్దం దూరమయ్యామని తెలిపింది. ఇక ధోని వెంటనే పెళ్లి చేసుకుని మూవ్ ఆన్ అయిపోయాడు. నాకు ఇంకా పెళ్లి కాలేదు. భవిష్యత్‌లో నాకు పెళ్లయి పిల్లలు పుట్టాక వారికి.. తనకు ధోనికి మధ్యనున్న రిలేషన్ తెలిస్తే ఎం జరుగుతుందో అని లక్ష్మీరాయ్ ఆందోళన వ్యక్తం చేసింది. ధోనితో విడిపోవడం తన కెరీర్ పై మచ్చ పడేలా చేసిందని లక్ష్మీ రాయ్ ఆవేదన వ్యక్తం చేసింది.

Read Also : Silpa Chowdary Scam : టాలీవుడ్‌లో శిల్పా చౌదరి మరో సంచలనం.. రూ.100 నుంచి 200 కోట్ల కుంభకోణం..?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel