Moong Dal Soup Tips : పెసర పప్పుతో వంటకాలు అద్భుతంగా ఉంటాయి. చాలామంది పెసర పప్పును తినేందుకు ఇష్టపడతారు. పెసర పప్పు రుచికి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందని తెలుసా? పెసర పప్పు ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. అంతేకాదు.. ఎలాంటి జ్వరాలు వచ్చినా చిటికెలో తగ్గించగలదు. పెసర పప్పులో అద్భుతమైన పోషకాలు ఉన్నాయి. జ్వరం వచ్చినప్పుడు పెసరపప్పుతో తయారుచేసిన వంటలను తినాలని వైద్యులు చెబుతుంటారు. పెసరపప్పును కూరలా కాకుండా సూప్ మాదిరిగా కూడా చేసుకోవచ్చు. ఈ సూప్ చాలా రుచిగా ఉండదు. ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది. పెసరపప్పుతో సూప్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Moong Dal Soup Tips : పెసర పప్పు సూప్ తయారీ ఇలా :
ఒక పావు కప్పు పెసర పప్పు తీసుకోండి.. రెండు కప్పులు నీళ్లు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ తురిమిన అల్లం తీసుకోవాలి. క్యారెట్ ముక్కలు, అర కప్పు గుమ్మడికాయ ముక్కలు, పావు కప్పు మిరియాలు, చిటికెడు అల్లం పొడి తీసుకోవాలి, చిటికెడు వాముతో పాటు కొద్దిగా ఉప్పు, మెంతి కూర తీసుకోవాలి. పెసరపప్పుని అరగంట నానబెట్టుకోవాలి. ఆ నీళ్లను తీసేయాలి. స్టవ్‌పై కుక్కర్ పెట్టి నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. జీలకర్ర, తురిమిన అల్లం వేసుకోవాలి. పెసరపప్పుని వేసుకుని వేయించాలి. గుమ్మడికాయ క్యారెట్, ముక్కలను బాగా కలపాలి. నీళ్లని పోసి కుక్కర్ మూత పెట్టేయాలి.
స్టవ్‌ని సన్నని మంటపై ఉంచి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఉడికిన తర్వాత వాము, ఉప్పు, మిరియాలు, అల్లం పొడి కలపాలి. మెంతి కూరను వేసుకుంటే బాగుంటుంది. అంతే.. రుచికరమైన పెసర పప్పు సూప్ రెడీ అయినట్టే.. అసలే చలికాలం.. ఈ సీజన్‌లో జలుబు, దగ్గు, జ్వరం ఎక్కువగా వస్తుంటాయి. ఇలాంటి సమయంలో పెసరపప్పు సూప్‌ను తాగితే రోగ నిరోధక శక్తి పెరిగి తొందరగా కోలుకుంటారు. ఇంకెందుకు ఆలస్యం.. మీ ఇంట్లో ఎవరైనా జ్వరంతో బాధపడుతుంటే వెంటనే పెసర పప్పు సూపు తయారు చేసి తాగించండి.. తొందరగా కోలుకుంటారు.
Read Also : High BP Tips : హైబీపీ సమస్యతో బాధపడుతున్నారా… వీటికి దూరంగా ఉంటే మంచిది !