Karthika Deepam Dec 10 Today Episode : ఇంద్రుడు మాటలు విని సంతోషపడిన చంద్రమ్మ.. దగ్గరవుతున్న కార్తీక్, దీప?

Karthika Deepam Dec 10 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో కార్తీక్ దీప ని చూసి బాధపడుతూ ఉంటాడు.

ఈరోజు ఎపిసోడ్ లో కళ్ళు తెరిస్తే ఇల్లు వస్తుంది అన్నారు మరి కళ్ళు తెరిస్తే హాస్పిటల్ లో ఉన్నాను నాకు ఏమైంది డాక్టర్ బాబు అని అడగగా జర్నీ చేసి అలసిపోయావు దీప కళ్ళు తిరిగడంతో తీసుకొని వచ్చాను అని అనడంతో కళ్ళు తిరిగితే ముఖంపై కొన్ని నీళ్లు చల్లితే సరిపోయేది డాక్టర్ బాబు మళ్ళీ ఇంత దూరం తీసుకొని రావాలా అని అంటుంది. కళ్ళు తెరిస్తే అక్కడ మావయ్య, అత్తయ్య వాళ్ళని చూసేదాన్ని కానీ ఇక్కడ ఈ డాక్టర్లు నర్సులను చూడాలి వస్తుంది మనం వెళ్లిపోదాం పద డాక్టర్ బాబు అని అంటుంది దీప.

 Karthika Deepam Dec 10 Today Episode
Karthika Deepam Dec 10 Today Episode

మనం హైదరాబాద్ కి వెళ్లడం లేదు దీప సంగారెడ్డికి మన ఇంటికి వెళ్తున్నాము అని అనడంతో ఎందుకు డాక్టర్ బాబు అని అడగగా అమ్మ వాళ్లు అక్కడ లేరు ఇక్కడికే వచ్చేసారు అందుకే మనం ఎక్కడికి వెళ్దాం. వాళ్లు అక్కడికి వచ్చేలోపు మనం లేకపోతే ఎక్కడికో వెళ్లిపోయారు అనుకుంటారు అందుకే వెళ్దాం పదా అనగా సరే అని బయలుదేరుతారు. మరొకవైపు చంద్రమ్మ జ్వాలమ్మ వెళ్లిపోతుంటే నా మనసంతా ఏదో కోల్పోయినట్టుగా వెలితిగా ఉంది. జ్వాలమ్మ వెళ్లిపోయిన తర్వాత నేను ఉండగలనా జ్వాలమ్మను విడిచిపెట్టి బతకగలనా అనుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి శౌర్య వస్తుంది.

Advertisement

ఏం చేస్తున్నావ్ పిన్ని అనడంతో ఏం లేదు జ్వాలమ్మ వచ్చి కూర్చో నీకు టిఫిన్ పెడతాను అని అంటుంది. ఇప్పుడు చంద్రమ్మ మనసులో ఇవాళ ఒక్కటే జ్వాలమ్మ నీకు ప్రేమగా తినిపించేది. రేపు ఈపాటికి నువ్వు మీ ఇంట్లో ఉంటే నేను మా ఇంట్లో ఉంటాను అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు కార్తీక్ దీపను కారులో తీసుకెళ్లి దూరం నుంచి అదిగో మమ్మీ వాళ్ళ ఇల్లు అది అని సౌందర్య వాళ్ళ ఇంటిని చూపించి అక్కడి నుంచి తీసుకుని వెళుతూ ఉంటాడు. మరొకవైపు ఇంద్రుడు సౌందర్య ఇంటికి వెళుతుండగా కార్తీక్ అది చూసి అబద్ధం చెప్పి అక్కడ నుంచి వెళ్లి ఇంద్రుడు చేయి పట్టుకుని పక్కకు పిలుచుకొని వెళ్తాడు.

ఎంత మోసం చేశావు మా బిడ్డని నీ దగ్గరే ఉంచుకొని నాటకాలు ఆడుతూ మమ్మల్ని తిప్పుతున్నావు అని అనడంతో వెంటనే ఇంద్రుడు నన్ను క్షమించండి సార్ అప్పుడు ఏదో తెలియక చేశాను అంటూ దీప పడిపోయిన విషయం జరిగింది మొత్తం వివరిస్తాడు. నేను మీకోసం చాలా వెతికాను సార్ మీరు కనిపించలేదు అందుకే అమ్మగారికి అయ్యగారిని కలిసి శౌర్యమని వెనక్కి తీసుకొని వెళ్ళమని చెబుతానని వచ్చాను అని అంటాడు. మీరు తీసుకెళ్తారా లేకుంటే అయ్యా గారిని అమ్మగారిని తీసుకెళ్ళమని చెప్పమంటారా? చెప్పండి సార్ అనడంతో ఎవరు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు పాపను నీ దగ్గరే ఉంచుకో అని అనడంతో ఇంద్రుడు షాక్ అవుతాడు.

అదేంటి సార్ కన్నతల్లి మనసు అంతలా విలవిల్లాడుతుంటే ఎలా పెట్టుకోమంటారు అని అనగా కొన్ని పరిస్థితులు బాగోలేవు అంతవరకు నీ దగ్గరే ఉంచుకో తర్వాత నేను వచ్చి తీసుకుని వెళ్తాను అని అంటాడు కార్తీక్. అప్పుడు ఇంద్రుడు నేను చేసిన పనికి మీరు సీరియస్ అయ్యి కొడతారు అనుకున్నాను సార్ అనడంతో నిన్ను ఎందుకు కొడతాను మమ్మల్ని తిప్పించావు అన్న కోపం తప్పితే మా బిడ్డని నువ్వు కూడా బాగానే చూసుకున్నావు కదా అని అంటాడు కార్తీక్. సరే ఇక్కడ నీతో చాలా సేపు మాట్లాడే సమయం నాకు లేదు మేము కూడా అదే ఊరికి వస్తున్నాము. నా ఫోన్ నెంబర్ తీసుకో అని చెప్పి ఇంద్రుడికి ఫోన్ నెంబర్ ఇచ్చి అక్కడ నుంచి పంపించేస్తాడు కార్తీక్.

Advertisement

ఆ తర్వాత నన్ను క్షమించు దీప అని కార్తీక్ బాధపడుతూ ఉంటాడు. మరొకవైపు చంద్రమ్మ ఇంద్రుడి ఇంకా రాలేదు ఏంటి అని టెన్షన్ పడుతూ ఉండగా ఇంతలోనే ఇంద్రుడు వస్తాడు. అప్పుడు ఇంద్రుడు జరిగింది మొత్తం వివరించడంతో చంద్రమ్మ సంతోష పడుతూ ఉంటుంది. వెంటనే ఇంద్రుడు నువ్వు మళ్ళీ జ్వాలమ్మ మీద ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు చంద్రమ్మ అని చెబుతాడు. ఆ తర్వాత దీప పూజ చేస్తూ ఉండగా ఇంతలోనే కార్తీక్ అక్కడికి కాఫీ తీసుకుని వస్తాడు. ఏంటి మీరు తీసుకుని వచ్చారు డాక్టర్ బాబు అని అడగగా ఈరోజు నుంచి నీ పేరు వంటలక్క కాదు నువ్వు వంట చేయడం లేదు నేను చేస్తాను నాకు నేర్పించు అని అనడంతో దీప కామెడీగా మాట్లాడుతుంది.

అప్పుడు అది సరే ఇప్పుడు టిఫిన్ ఏం చేయమంటారు డాక్టర్ బాబు అని అడగగా ఏం చేయద్దు దీప నేను హాస్పిటల్ కి వెళ్లి అక్కడే తింటాను చారుశీల నీకోసం టిఫిన్ పంపిస్తాను అని చెప్పింది అని అంటాడు. అలాగే మీకోసం ఒక వంట మనిషిని చూశాను అనడంతో నేను ఇంట్లోనే ఉంటాను కదా ఏం చేయాలి అని అనడంతో ఆపరేషన్ అయింది కదా దీప రెస్ట్ తీసుకో అని అంటాడు కార్తీక్. రావాలి ఇద్దరు సరదాగా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు.

Read Also : Karthika Deepam Dec 9 Today Episode : దీప పరిస్థితి తెలిసి కుమిలిపోతున్న కార్తీక్.. సౌందర్య దగ్గరికి బయలుదేరిన ఇంద్రుడు..?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

RELATED POSTS

Join our WhatsApp Channel