...

CM Etela Rajender : సీఎంగా ఈటల రాజేందర్.. అధ్యక్షా అంటూ…

CM Etela Rajender : సీఎం ఈటల రాజేందర్ సీఎంగా వ్యవహరించారు. అసెంబ్లీలో ఆయన అధ్యక్షా అంటూ మాట్లాడారు.. ఏంటండి.. తెలంగాణ సీఎం కేసీఆర్ కదా.. ఈటల రాజేందర్‌ను సీఎం అంటున్నారు ఏంటని అనుకుంటున్నారు.. అవునండి.. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భవిష్యత్ తెలంగాణ వేదిక ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ ఆడిటోరియంలో శుక్రవారం మాక్ అసెంబ్లీ నిర్వహించారు.

ఇందుకు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. మాక్ అసెంబ్లీలో ఆయన సీఎంగా వ్యవహరించారు. అంతకు ముందు జ్యోతి ప్రజ్వలన చేసిన ఆయన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీరియన్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ గవర్నర్ గా వ్యవహరించగా.. బీజేపీ లీడర్ పేరాల శేఖర్ రావు డిప్యూటీ సీఎంగా పాత్ర పోషించారు.

అనంతరం సీఎం హోదాలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. సామాన్యులకు రాజ్యాంగం కలిపిస్తున్న అవకాశాలు ఎంటో ఆయన తెలిపారు. హుజూరాబాద్ బై పోల్‌లో తనను ఓడించేందుకు సీఎం కేసీఆర్ ఎన్ని ప్లాన్ లు వేసినా.. ప్రజలు ఆయన కుట్రలను ఓడించి ధర్మాన్ని గెలిపించుకున్నారని చెప్పుకొచ్చారు. మాక్ అసెంబ్లీలో సాయికృష్టా రావు, దేవికారెడ్డి, ఎర్రబెల్లి రజినీకాంత్‌ను స్పీకర్లుగా ఎన్నుకున్నారు. హుజూరాబాద్ బైపోల్‌లో విజయం సాధించిన బీజేపీ అదే ఊపుకు కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది.

తాజాగా ఆ పార్టీ రాష్ట్ర ఇన్ చార్జి తరుణ్ చుగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. టీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని కామెంట్స్ చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ కు చెందిన చాలా మంది నేతలు తమకు టచ్ లో ఉన్నారని అందులో ఎమ్మెల్యేలు, మినిస్టర్లు సైతం ఉన్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు ఆ పార్టీకి అభ్యర్థులు సైతం దొరకరని చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

Read Also : Chandrababu : లీడర్స్‌కు చంద్రబాబు వార్నింగ్.. వారికి  నో చాన్స్ అంటూ క్లారిటీ..