Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో తులసి పై అభి సీరియస్ అవుతాడు.
ఈ రోజు ఎపిసోడ్ లో తులసి ఈరోజు తాతయ్య పుట్టినరోజు మన అందరికీ ఈ పండుగ రోజు కొద్దిగా ముందు వచ్చింది నువ్వు కూడా పార్టీ ఎంజాయ్ చేసేవాడివి అని అనడంతో వెంటనే అభి నువ్వు కొత్తింట్లో చేరావనో లేకపోతే నువ్వు బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నావనో ఇక్కడికి రాలేదు. అయినా నేను వచ్చి చాలాసేపు అయింది వచ్చి బయట నుంచి మీరు చేస్తున్న సెలబ్రేషన్స్ అన్ని చూస్తున్నాను అని అంటాడు అభి.
అప్పుడు తులసి లోపలికి వచ్చి ఏదైనా అడగాల్సింది అడగవచ్చు కదా అని అనగా మా తాతయ్య ముందు సీన్ క్రియేట్ చేయడం నాకు ఇష్టం లేదు అనటంతో వెంటనే అంకిత ఈ పెద్ద వాళ్లకి మర్యాద ఇవ్వడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు అనడంతో వెంటనే అభి మా మామ్ సిగ్గు మర్యాద వదిలేసిన రోజు నుంచి అని అంటాడు. అప్పుడు అభి తులసి గురించి నోటికొచ్చిన విధంగా వాడడంతో అంకిత మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం రా అభి అని పిలిచినా కూడా అవి అంకితను పక్కకు తోసేస్తాడు.
అసలు ఏంటి నీ పెద్దరికం నీ వివాహ బంధాన్ని నిలుపుకోవడం చేతకాలేదు కానీ నీ పిల్లలకు నువ్వు నీతులు నేర్పుతున్నావా అంటూ తులసి గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు. నీలాగే నా మా మొగుడు జీవితాలు విడదీసి మా జీవితాలను నాశనం చేయాలి అనుకుంటున్నావా అని అంటాడు. నేను నిన్ను నవమాసాలు మోసిన తల్లిని అభి నేను జీవితం ఎందుకు నాశనం చేస్తాను అని అనడంతో ఆల్రెడీ నాశనం చేసేసావు మామ్ అని అంటాడు అభి. ఇప్పుడు అభి మరింత రెచ్చిపోతూ తులసి గురించి తప్పుగా మాట్లాడడంతో అంకిత సీరియస్ అవుతుంది.
కూడా అభి ఏ మాత్రం తగ్గకుండా తులసి క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడటం తో వెంటనే సామ్రాట్ చాలు అభి ఎక్కువ మాట్లాడకు శ్రీరాములులా ఉండే ఈ సామ్రాట్ లో పరశురాముడు కూడా ఉన్నాడు నీ నోటి నుంచి ఇంకొక మాట వచ్చినా కూడా పరుశురాముడులా గొడ్డలి తీస్తాను అని కోపంతో మాట్లాడుతాడు సామ్రాట్. ఇప్పుడు సామ్రాట్ మాటలకు మరింత రెచ్చిపోయిన అభి సామ్రాట్ తో ఎటువంటి సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడుతూ మా మామ్ ఇలా అవడానికి మా కుటుంబంలో సమస్యలు రావడానికి ప్రధాన కారణం మీదే అంటూ సామ్రాట్ ని నిర్ణయిస్తాడు.
ఈరోజు మా అమ్మ ఇలా ఇల్లు వదిలి వచ్చింది అంతే అందుకు కారణం కూడా నువ్వే అని అంటాడు అభి. అప్పటివరకు అభి మాటలను ఓర్పుతో సహించిన తులసి ఒక్కసారిగా అభి చెంప చెల్లుమనిపించడంతో కింద పడిపోతాడు. అప్పుడు తులసి కాలర్ పట్టుకుని చెంపలు వాయించి లోకమంతా దిగజారిన మీ అమ్మ చెడ్డది కాదురా మీ అమ్మ ఎలాంటిదో నువ్వు తలకింద తెపస్తులు చేసినా కూడా నీకు అర్థం కాదు అని సీరియస్ అవుతుంది తులసి.
నువ్వు నా కొడుకు కాదురా మీ నాన్న కొడుకువి నువ్వు నా కొడుకువి అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. ఇప్పుడు చెప్తున్నాను గుర్తుపెట్టుకో ఇకపై నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటుంది తులసి. అప్పుడు అభి ని కాలర్ పట్టుకుని బయటకు గెంటేస్తుంది. అభి మాటలకు మనసు నొచ్చుకున్న సామ్రాట్ ఇదంతా నా వల్లే జరిగింది అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World