Devatha: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రాధ బాధతో కుమిలిపోతూ ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో రాధా ఎమోషనల్ అవుతూ అందరికీ నిజం తెలిసిపోయింది కాబట్టి ఈరోజు కాకపోయినా రేపైనా నన్ను బలవంతంగా అత్తమ్మ ఇంటికి తీసుకొని వెళుతుంది నేను ఇంటికి వెళ్తే నా చెల్లెలు బతుకు ఆగమవుతుంది. అత్తమ్మ ఇక్కడికి వచ్చేలోపు ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని వెళ్లి బట్టలు సర్దుకుంటుంది రుక్మిణి.
అప్పుడు రుక్మిణి బట్టలు సర్దుకుని బయలుదేరి వెళుతూ ఉండగా ఎక్కడికి వెళ్తున్నావ్ అమ్మ అని రామ్మూర్తి అడగడంతో ఇటువంటి రోజు వస్తుంది అని తెలుసు. అమ్మని జాగ్రత్తగా చూసుకోండి పాపని చక్కగా చూసుకోండి అని అందరికీ అప్పగింతలు చెబుతుంది. అప్పుడు రుక్మిణి వెళ్ళిపోతూ ఉండగా రామ్మూర్తి జానకి ఎమోషనల్ అవుతారు.
అప్పుడు రుక్మిణి మీరు కాదు నేను మీకు రుణపడి పోతాను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను చీర తీసి ఆదరించారు అని అంటుంది. బిడ్డని స్కూల్ నుంచి పిలుచుకుని రా అమ్మ నేను వెళ్ళిపోవాలి అని అంటుంది రుక్మిణి. అప్పుడు సంతోషంగా భాగ్యమ్మ నేను కూడా ఈరోజు కోసం ఎదురు చూశాను అని దేవిని తీసుకొని రావడానికి వెళుతుంది. మరొకవైపు దేవుడమ్మ జరిగిన విశాల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండగా ఇంతలోనే ఆదిత్య అక్కడికి రావడంతో కోపంతో రగిలిపోతూ ఉంటుంది దేవుడమ్మ.
ఏం జరిగింది అమ్మ అని ఆదిత్య అనడంతో వెంటనే ఆదిత్య చెంప చెల్లుమనిపిస్తుంది దేవుడమ్మ. ఇంతలోనే అక్కడికి అందరూ వచ్చి ఏం జరిగింది అనడంతో ఎవరూ మాట్లాడొద్దు నేను వీడు మాత్రమే మాట్లాడాలి అని దేవుడమ్మ నువ్వు ఎవరితో కలిసి దీపాలు వెలిగించావు గుడిలో అని అడగడంతో ఆదిత్య షాక్ అవుతాడు. నువ్వు చెప్పవు నేను చెప్పనా రుక్మిణి కలసి గుడిలో దీపాలు వెలిగించారు అనడంతో అక్కడున్న వారందరూ షాక్ అవుతారు.
అప్పుడు రాజమ్మ అక్క నువ్వు అనుకున్నట్టుగా రుక్మిణి బతికే ఉందా అనడంతో బతికే ఉంది ఈ ఆదిత్య ఎప్పటి నుంచో రుక్మిణి కలుస్తున్నాడు అని బాధగా మాట్లాడుతుంది. అప్పుడు చెప్పు ఆదిత్య ఎందుకు ఇన్ని రోజులు నా దగ్గర నిజం దాచావు అని అనటంతో వెంటనే ఆదిత్య నిజం చెబుతాడు. మరొకవైపు సత్య రుక్మిణి గురించి నోటికి వచ్చిన విధంగా వాగడంతో వెంటనే భాగ్యమ్మ సత్య చంప చిల్లు మనిపించి అసలు ఆ మాధవ గారికి మీ అక్కకి ఎటువంటి సంబంధం లేదు అని అసలు విషయం చెప్పడంతో సత్యా బోరున ఏడుస్తూ ఉంటుంది.
మరొకవైపు ఆదిత్య అసలు ఆ మాధవాకి రాధా కి ఎటువంటి సంబంధం లేదు ఇప్పటికి రాధా మన ఇంటి కూడదు గానే బతుకుతుంది. ఈ విషయం చెప్పలేక ఇన్నాళ్లు కుమిలిపోయాను ఆ మాధవ గాడు బయట అందరికీ రాధా తన భార్య అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటే నేను అసలు విషయం చెప్పలేక ఎంత కుమిలిపోయానో అని అంటాడు. అప్పుడు దేవుడమ్మ నువ్వు ఇన్ని బాధలు మనసులో పెట్టుకొని ఎంత నరకం అనుభవించుంటావో నేను అర్థం చేసుకుంటాను ఆదిత్య అని అంటుంది.
అతను చూసాను నా మనవరాలు ఎక్కడ అనడంతో ఇంతలోనే అక్కడికి ఆఫీసర్ సారు అని వస్తుంది దేవి. అప్పుడు దేవి ఎవరు కాదమ్మా అని మనవరాలు అని అనడంతో అక్కడున్న వారందరూ సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు దేవిని ముద్దాడుతూ ఉంటుంది దేవుడమ్మ. అప్పుడు దేవి నువ్వే మా నాయన అన్న విషయం నాకు తెలుసు నాయనా అనడంతో ఆదిత్య సంతోష పడుతూ ఉంటాడు.