Guppedantha Manasu serial Oct 22 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే కట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో రిషి, వసు ఇద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్ లో మహేంద్ర, జగతితో ఇదంతా కలయితే బాగుండు రేపు ఉదయం లేచే సరికి రిషి నా కళ్ళ ముందు ఉంటాడు అనే బాధపడుతూ ఉంటాడు మహేంద్ర. అప్పుడు జగతి బాధపడకు మహేంద్ర ఇది మనం రిషి ఇస్తున్న కానుక అనుకుందాం అని అంటుంది. మరోవైపు రిషి వసుధారతో కారులో వెళ్తూ వసుధార, నా జీవితంలో దేవుడు ఇచ్చిన కానుక నువ్వు అని అంటాడు. దానికి వసుధార, లేదు సార్ మీరే నాకు కానుక అని అంటుంది. ఆ తర్వాత వసు ని తన రూమ్ దగ్గర దింపేసి వెళ్లిపోతాడు రిషి.
ఇక మరసటి రోజు ఉదయం వసుధార మొబైల్ చూసేసరికి జగతి నుంచి చాలా మెసేజ్లు వచ్చి ఉంటాయి ఏంటి మేడం ఇలా మిషన్ ఎడ్యుకేషన్ సంబంధించినవి నాకు పెట్టింది అని జగతికి కాల్ చేయగా జగతి ఫోన్ స్విచాఫ్ వస్తుంది. దాంతో వసు టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ తర్వాత మహేంద్ర కోసం తన గదిలోకి వెళ్ళగా అక్కడ మహేంద్ర ఉండడు.
Guppedantha Manasu అక్టోబర్ 22 ఎపిసోడ్ : మహేంద్ర కోసం రిషి బాధ..గౌతమ్ షాక్..దేవయానిని నిలదీసిన రిషి..
ఇక ఉదయాన్నే ఎక్కడికి వెళ్లి ఉంటాడు అని అనుకోగా ఇంతలోనే అక్కడ ఫోటో ఫ్రేమ్ లో వెళ్తున్నాం అని రాసి ఉంటుంది. వెంటనే కంగారు పడిన రిషి పెద్దమ్మ డాడ్ ఎక్కడ అని అడగగా వాళ్ళు వెళ్లిపోయారు చెప్పిన నా మాట వినలేదు అని అంటుంది దేవయాని. అలా ఎలా వెళ్ళిపోతారు పెద్దమ్మ మీరేనా కనీసం నాకు ఒక్క చెప్పాలి కదా వెళ్తున్నప్పుడు ఫోన్ చేయాలి కదా అని అంటాడు రిషి.
నేను ఎంతో అడ్డుకోడానికి ప్రయత్నించాను రిషి కానీ వాళ్ళు నా మాట వినలేదు తిరిగి నన్నే అన్నారు అనరాని మాటలు అన్నీ అన్నారు అని అనగా రిషి, అంటే అన్నారు లెండి పెద్దమ్మ ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్లారు అనేది ముఖ్యమైనది. మీరు డాడ్ ని అనకూడని మాటలు ఏమైనా అన్నారా చెప్పండి పెద్దమ్మ అని గట్టిగా అరుస్తాడు రిషి. దాంతో ఏంటి రిషి ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటుంది దేవయాని. నేను ఏమీ అనలేదు వాళ్ళు వెళుతున్నప్పుడు కూడా నేను ఆపడానికి ప్రయత్నించాను అంటూ నాటకాలు ఆడుతూ ఉంటుంది.
ఇంతలోనే గౌతమ్ అక్కడికి వచ్చి ఏం జరిగింది అని అనడంతో ఇంకేముంది బట్టలు సర్దుకొని ఇంట్లోంచి వెళ్లిపోయారు అనడంతో గౌతమ్ షాక్ అవుతారు. ఇప్పుడు గౌతమ్ రిషిని ఓదారుస్తూ వాళ్ళు ఎక్కడికి వెళ్లి ఉండరు నువ్వు భయపడకూడా రిషిని దైర్యం చెబుతూ ఉంటాడు. అప్పుడు అవకాశం దొరికింది కదా అని మహేంద్ర వారిపై లేనిపోని మాటలు చెప్పి రిషిని ఇంకా రెచ్చగొడుతూ బాధ పెడుతూ ఉంటుంది దేవయాని. దయచేసి ఆపండి పెద్దమ్మ అని అంటాడు గౌతమ్.
అప్పుడు ధరణి మనసులో, ఈవిడే ఏదో ఒకటి చేసి ఉంటుంది అని అనుకుంటుంది. అప్పుడు రిషి, డాడ్ ఇలా చేయరు కదరా గౌతమ్ అని అనగా, నువ్వు బాధపడొద్దు నేను వెళ్లి వెతికి వస్తాను ఎక్కడికి వెళ్లి ఉండరు. నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి అక్కడ నుంచి వెళ్తాడు గౌతమ్. తర్వాత దేవయాని రిషి పక్కన కూర్చొని ఏమీ తెలియనట్టుగా నాటకాలు ఆడుతూ ఉంటుంది. దాంతో రిషి బాధపడుతూ ఉంటాడు. మరొకవైపు గౌతమ్ వసుధార ఒకచోట కలుసుకోగా గౌతమ్ అసలు విషయం చెప్పడంతో వసు ఒక్కసారిగా షాక్ అవుతుంది.
అలా ఎలా వెళ్ళిపోతారు సార్ అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు గౌతమ్ నువ్వు రిషి గాడితో జాగ్రత్తగా ఉండు అని చెబుతాడు. సరే సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ నావల్ల ఇలా జరిగిందా ఇందుకు నేనే కారణమా అంటూ రిషి ఇంటికి బయలుదేరుతుంది. మరోవైపు దేవయాని రిషి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. డాడీ కి నా మీద కోపం వస్తే తిట్టే హక్కు కొట్టే హక్కు ఉంది కదా ఎప్పుడు కోపం వచ్చినా నన్ను ఏమీ అనరు ఎందుకంటే నేను బాధ పడతాను అని అటువంటిది ఇప్పుడు ఎలా వదిలేసి వెళ్లిపోయారో అర్థం కావడం లేదు అని బాధపడుతూ ఉంటాడు.
ఇంతలోనే అక్కడికి వసు వస్తుంది.అప్పుడు రిషి కంగారుగా అక్కడికి వెళ్లి వసు నీకు ఏమైనా తెలిసిందా అని అనడంతో లేదు సార్ అని అంటుంది. సర్ మీరు బానే ఉన్నారా అని అడగగా, డాడ్ కనిపించడం లేదు వసు. ఇప్పుడు వసుధార మీరు ముందు ధైర్యంగా ఉండండి సార్ గౌతమ్ సార్ వెతకడానికి వెళ్లారు కదా వస్తారులే అని అంటుంది. ఇప్పుడు రిషి ని పైకి తీసుకుని వెళుతూ ఉండగా అప్పుడు దేవయాని అడ్డుపడి ఎక్కడికి తీసుకెళ్తున్నావు వసుధార అనడంతో ధైర్యం చెప్పడానికి తీసుకెళ్తున్న మేడం అలాగే ఒక స్ట్రాంగ్ కాఫీ పంపించండి అని చెబుతోంది వసు. దానికి దేవయాని ఆశ్చర్యపోయి, నేను కాఫీ తేడం ఏంటి అని అనగా, కాఫీ కాదు స్ట్రాంగ్ కాఫీ తెచ్చేయండి మేడం అని రిషి ని తీసుకుని పైకి వెళ్ళిపోతుంది వసు. అప్పుడు దేవయాని కోపంతో రగిలిపోయి ఉంటుంది.
Read Also : Guppedantha Manasu serial Oct 21 Today Episode : ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న జగతి,మహేంద్ర.. ఆనందంలో దేవయాని?
Tufan9 Telugu News And Updates Breaking News All over World