Karthika Deepam serial Oct 12 Today Episode : దీపను చంపడానికి సిద్ధమైన మోనిత..వారణాసికి ఎదురుపడ్డ కార్తిక్..?

Karthika Deepam serial Oct 12 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లు కార్తీక్ జరిగిన విషయాల గురించి తలచుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఈ రోజు ఎపిసోడ్ లో దీప బతుకమ్మను నీళ్లలో వదిలిపెట్టడానికి వెళ్లి అమ్మవారికి మొక్కుకుంటూ ఉంటుంది. అతని వద్ద దీప,కార్తీక్,మోనితల గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ మోనిత నన్ను చంపేస్తానని బెదిరించింది అంతేకాదు దాని బండారం ఎక్కడ బయట పడుతుందో అని కావాలంటే డాక్టర్ బాబుని ఇక్కడి నుంచి ఎక్కడికైనా పంపించేస్తుంది అమ్మ అని టెన్షన్ పడుతూ ఉంటుంది దీప.

Rajyalakshmi gives a suggestion to Karthik in todays karthika deepam serial episode
Rajyalakshmi gives a suggestion to Karthik in todays karthika deepam serial episode

మరొకవైపు మోనిత,దీపను చంపడం కోసం మనుషుల్ని పంపిస్తుంది. మరొకవైపు శౌర్య, దీప కోసం వెతుకుతూ ఉంటుంది. దీప,మోనిత ఇద్దరూ కార్తీక్ కోసం వెతుకుతూ ఉంటారు. ఆ తర్వాత ఇంద్రుడు దీప దగ్గరికి వచ్చి అమ్మ నేను మా అమ్మాయి చూడాలి అనుకుంటుంది ఒకసారి రా అమ్మ అంటూ సౌర్య గతాన్ని చెబుతూ ఉండగా దీప వినిపించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

మరొకవైపు మోనిత, కార్తీక్ కోసం వెతుకుతూ ఉండగా ఇంతలో సౌర్య కనిపించడంతో సౌర్య పై కోప్పడుతుంది. మీ అమ్మ నాన్న కోసం పెద్దకొద్దు మీ అమ్మ నాన్నలు చనిపోయారు హైదరాబాదుకు వెళ్ళిపో అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఇంద్రుడు అక్కడికి వచ్చి ఇందాక మనం వెతుకుతున్న ఆమె కనిపించింది కానీ రాలేదు అనడంతో సౌర్య నిరాశపడుతుంది.

Advertisement

మరొకవైపు జరిగిన విషయాలు తలచుకొని కార్తీక్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. మరొకవైపు దీప వాళ్ళు కార్తీక్ కోసం వెతుకుతూ ఉంటారు. మోనిత కావేరి కూడా కార్తీక్ కోసం వెతుకుతూ ఉంటారు. మరొకవైపు కార్తీక్ ఒకచోటి నిలబడే ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి రాజ్యలక్ష్మి వస్తుంది. అప్పుడు కార్తీక్ నాకు ఏంటో అర్థం కాక అయోమయంగా ఉంది అమ్మ చెప్పడంతో వెంటనే రాజ్యలక్ష్మి దీప గురించి గొప్పగా చెబుతూ ఉంటుంది.

కార్తీక దీపం సీరియల్ అక్టోబర్ 12 ఈరోజు ఎపిసోడ్ : వారణాసికి ఎదురుపడ్డ కార్తిక్..?

అప్పుడు మోనిత మాటలు నమ్మకు దీప మాటలు నమ్ము అని చెప్పడంతో నాకు అంత అయోమయంగా ఉంది అని తల పట్టుకుంటాడు కార్తీక్. అప్పుడు ఆమె నా అనుభవంతో చెబుతున్నాను దీపనే మంచిది బతుకమ్మ సాక్షిగా చెబుతున్నా నీకు అంతా మంచే జరుగుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కార్తీక్ ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్తూ ఉండగా ఇంతలోనే వారణాసి ఎదురుపడతాడు.

ఇప్పుడు డాక్టర్ బాబు మీరు బతికే ఉన్నారా మిమ్మల్ని మళ్ళా ఇలా చూస్తాను అనుకోలేదు అనటంతో కార్తీక్ కోపంతో ఎవర్రా నువ్వు అంటూ వారణాసి పై సీరియస్ అవుతాడు. మొబైల్ లో ఉన్న దీప,కార్తీక్ ల ఫోటోను చూపిస్తాడు. మరొకవైపు సౌర్య,మోనిత అన్నమాట తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు మోనిత ప్రవర్తన పై శౌర్య ఇంద్రుడికి అనుమానం వస్తుంది. మరొకవైపు మోనిత దీప ను చంపడం కోసం మనుషుల్ని పంపిస్తుంది. మరోవైపు దీప, కార్తీక్ కోసం వెతుకుతూ ఉంటుంది.

Advertisement

అప్పుడు మోనిత కనిపించడంతో మోనిత దగ్గరికి వెళ్లి కార్తీక్ గురించి వాదిస్తూ ఉంటుంది దీప. మోనిత కావాలని దీపను రెచ్చగొట్టి వీధి చివరన ఉన్నాడు అంటూ తన ప్లాన్ సక్సెస్ అయ్యే విధంగా దీపను అక్కడికి పంపిస్తుంది. దీప అక్కడి నుంచి వెళ్లిపోవడంతో మోనిత ఆనందపడుతూ ఉంటుంది.

Read Also : Karthika Deepam: మోనిత నిజస్వరూపం తెలుసుకున్న కార్తీక్.. దీపను చంపేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చిన మోనిత..?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel