Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రాజ్యలక్ష్మి మోనిత, కావేరి కీ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది.
ఈరోజు ఎపిసోడ్ లో ఇప్పుడు రాజ్యలక్ష్మి ఇవన్నీ పక్కన పెట్టి మొదట బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేసుకుందాం అని అనగా వెంటనే మోనిత మనసులో ఇంకా నయం ఈ మాటలు అన్నీ కార్తీక్ వినలేదు అని చుట్టూ చూడగా అక్కడ కార్తీక్ ఉండడంతో మోనిత ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంతలోనే అక్కడికి శౌర్య రావడం చూసి మోనిత మరింత షాక్ అవుతుంది.
ఆ తరువాత మోనిత ఎలా అయినా కార్తీక్,దీప, సౌర్య కంట పడకుండా చేయాలి అని అబద్ధం చెప్పి ఇద్దరినీ అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేస్తుంది. అప్పుడు కావాలనె డ్రైవర్ శివని దీప దగ్గరికి వెళ్లి కార్తీక్ సార్ పిలుస్తున్నారు రమ్మని చెప్పు అని అబద్ధం చూపిస్తుంది. అప్పుడు దీప,కార్తిక్ కోసం వెతుకుతూ ఉండగా ఇంతలో మోనిత అక్కడికి వచ్చి వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది.
అప్పుడు ఏంటే పిచ్చిపిచ్చి వాగుతున్నావ్ అని అనగా అప్పుడు మోనిత నువ్వేంటే పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావు అని అంటుంది. అప్పుడు మోనిత నీకు ఆ రాజ్యలక్ష్మి కి ఏంటే సంబంధం ఎందుకు ఆవిడ నీకు సపోర్ట్ చేస్తుంది అని అంటుంది. దీప ఏమని చెప్పారు నువ్వు ఈ ఊరి వాళ్ళతో నాటకం ఆడుతున్నావు అని బండారం బయట పెట్టారా అని అనగా పక్కనే ఉన్న కార్తీక్ ఆ మాటలు అన్ని వింటూ ఉంటాడు.
అప్పుడు మోనిత ఇలాంటి రాజ్యలక్ష్మి లను వంద మందిని పెట్టిన నా కార్తిక్ ని నమ్మించలేవు అనటంతో కార్తీక్ షాక్ అవుతాడు. అప్పుడు దీప నువ్వు నాటకం ఆడావ్ అని డాక్టర్ బాబుకి తెలిసిపోవడం ఖాయం అని అంటుంది. అప్పుడు మోనిత ఇలాగే నాకు నువ్వు అడ్డు వస్తే నిన్ను చంపేసి అయినా సరే నా కార్తీక్ నేను దక్కించు కుంటాను అనడంతో ఆ మాటలు విన్న కార్తిక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు.
ఇప్పుడు పైకి వెళ్లి నువ్వు దయ్యం అయ్యి కార్తీక్ నేను చూస్తూ ఉండు అని అనగా వెంటనే దీప నేను చచ్చిన దెయ్యాన్ని అయితే నువ్వు బతికున్న దెయ్యానివి అంటూ మాట్లాడుతుంది. అప్పుడు వారిద్దరు మాటలు విన్న కార్తీక్ షాక్ అవుతాడు. ఇప్పుడు దీప నువ్వు నన్ను ఏమి చేయలేవు అని నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
అప్పుడు పక్కనే ఉన్న కార్తీక్,మోనిత అక్కడ నుంచి వెళ్తూ ఉండగా ఆగు అని అనటంతో మోనిత ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు కార్తీక్ అక్కడికి వచ్చి నువ్వు దీపకి ఏమని వార్నింగ్ ఇస్తున్నావు అని అనటంతో ఏం లేదు కార్తీక్ అని అనగా వెంటనే కార్తీక్ మొత్తం విన్నాను మోనిత అని అంటాడు కార్తీక్. ఇప్పుడు మోనిత కావాలనే కార్తీక్ ని అవాయిడ్ చేయాలని లోపల భయం పెట్టుకొని కార్తీక్ కీ ధైర్యంగా మాట్లాడి కార్తిక్ కె వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
మరోవైవు శౌర్య ఇంద్రమ్మ దంపతులు దీప కోసం వెతుకుతూ ఉంటారు. మరోవైపు అందరూ కలిసి బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు మోనిత,దీప కూడా వాళ్లతో కలిసి బతుకమ్మ పండుగ ఆటలు ఆడుతూ ఉంటారు. బతుకమ్మ ఆడిన తర్వాత అందరూ అక్కడ నుంచి బతుకమ్మను తీసుకొని వెళుతూ ఉంటారు.
ఒకవైపు కార్తీక్, రాజ్యలక్ష్మి,మోనిత అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మరొకవైపు శివ నడుచుకుంటూ మోనిత గురించి ఆలోచిస్తూ వెళ్తూ ఉండగా సౌర్య కనిపించి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు శివ, సౌర్యని కార్తీక్ దగ్గరికి పిల్చుకొని వెళ్తూ ఉండగా అది చూసిన మోనిత ఆ పాపని అక్కడే వదిలేసింది నువ్వే వెళ్ళు అని వార్నింగ్ ఇస్తుంది.
Tufan9 Telugu News And Updates Breaking News All over World