Janaki Kalaganaledu serial Oct 6 Today Episode: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. జానకి ఇంటికి ఒక పాప వచ్చినందుకు అందరూ సంతోష పడుతూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో జానకి వాళ్ళ ఇంటికి వచ్చిన పాపతో పూజ చేయిస్తూ ఉంటుంది. అప్పుడు మల్లికా ఈ పాప వచ్చి నా ప్రాణం తో చెడగొట్టింది అని మనసులో కుళ్లుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆ పాప ఈ బొమ్మల కొలువు ఎందుకు పెడతారు అని అడగడంతో అప్పుడు జానకి దాని గురించి వివరిస్తూ ఉంటుంది.
అప్పుడు జానకి మాటలు విన్న జ్ఞానాంబ, ఈ మాటలు జానకి నాకే చెబుతున్నట్లు అనిపిస్తుంది. నేను విష్ణు అఖిల్ విషయంలో బాధపడుతున్నాను అని కాస్త ఓర్పుతూ ఉంటే వాళ్లే మారతారు అని జానకి నాకు చెప్పకనే చెప్పి కాస్త ప్రశాంతతను ఇచ్చింది అని అనుకుంటూ ఉంటుంది జ్ఞానాంబ. ఇప్పుడు నా ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యింది ఇంకొక ప్లాన్ చేయాలి అని మల్లిక ఇంకొక ప్లాన్ వేస్తుంది.
ఆ తర్వాత మల్లిక జానకి వాళ్ళ నాన్న పీటర్ కి ఫోన్ చేస్తుంది. అప్పుడు జ్ఞానాంబ గురించి చెడుగా చెప్పడంతో జెస్సి వాళ్ళ నాన్న షాక్ అవుతాడు. జెస్సిని కూడలిగా కాదు కదా కనీసం సాటి మనుషులా కూడా చూడడం లేదు అసలు విలువ ఇవ్వడం లేదు. అఖిల్ కూడా వాళ్ళ అమ్మని ఏమీ అనలేకపోతున్నాడు. రామచంద్ర జానకిలు కూడా ఏం చేయడం లేదు బాబాయ్ గారు అంటూ లేనిపోని మాటలు అన్ని చెప్పి వారిని రెచ్చగొడుతుంది.
ఇక జెస్సి కి ఇక్కడ సమస్యలు చెబితే తీరవు అని చెప్పి వారిని రెచ్చగొట్టి ఫోన్ కట్ చేస్తుంది. అప్పుడు మల్లిగ మాటలు నిజం అని నమ్మిన జెస్సి వాళ్ళ నాన్న ఇప్పుడు అక్కడికి వెళ్లి మనం నిజం తేల్చుకోవాలి. జ్ఞానాంబ గారు ఇలా చేస్తారని నేను అనుకోలేదు అని అనుకుంటూ ఉంటాడు. మరొకవైపు జానకి చదువుకుంటూ ఉండగా రామచంద్ర టీ కలుపుకొని వస్తాడు.
జానకి కలగనలేదు సీరియల్ అక్టోబర్ 6 ఈరోజు ఎపిసోడ్ :
జెస్సీ తల్లిదండ్రులు షాక్ ..
అప్పుడు జానకి నేను బాగానే చదువుకుంటున్నాను మీరు వెళ్లి పడుకోండి రామా గారు అని అంటుంది. కానీ రామచంద్ర వినకుండా జానకి చదువుకుంటుంటే అలాగే చూసుకుంటూ ఉంటాడు. ఇక మరుసటి రోజు ఉదయం మల్లిక జాగింగ్ చేస్తూ దాల దూరం వస్తుంది. అమ్మయ్య ఇంటికి చాలా దూరం వచ్చేసాను అని అనుకుంటూ జాగింగ్ చేస్తూ ఉండగా ఇంతలోనే రామచంద్ర జానకి వాళ్ళు అటుగా వస్తారు.
అప్పుడు వాళ్లను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది మల్లిక. ఏం చేస్తున్నావ్ మల్లికా అని జానకి అడగడంతో టీవీలో చెప్పారు అందుకే ఎక్సర్సైజ్ చేస్తున్నాను అని అనడంతో గర్భవతిగా ఉన్నవారు ఇలాంటి ఎక్సైజ్ చేయకూడదు కేవలం జాగింగ్ మాత్రమే చేయాలి అని మల్లికకు జాగ్రత్తలు చెబుతుంది జానకి. ఇప్పుడు మల్లికా కాస్త ఓవరాక్షన్ చేస్తూ కింద పడిపోతూ ఉండగా జానకి పట్టుకొని, ఇక ఈరోజు చాలు ఓవరాక్షన్ చేయకుండా ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకో పద అని అక్కడి నుంచి పిలుచుకొని వెళ్తుంది.
మరోకవైపు జ్ఞానాంబ దంపతులు నవరాత్రులు అయిపోయిలోగా ఇంట్లో సమస్యలను తీరిపోయి మనశ్శాంతిగా ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే జెస్సి తల్లి తండ్రీలు అక్కడికి వస్తారు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World