Big boss telugu6 : ఈ వారం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా?

Updated on: October 1, 2022

Big boss telugu6 : బిగ్ బాస్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేస్కున్న ఈ కార్యక్రమం ఆరో సీజన్ విజయవంతంగా దూసుకెళ్తుంది. ఈ లేటెస్ట్ సీజన్ కు నాగార్జుననే హోస్ట్ గా చేస్తున్నారు. ఈ రియాల్టీ షో సెప్టెంబర్ 4వ తేదీన ప్రారంభం అయింది. ఇంట్లోకి 21 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఇక మొదటి వారంలో బిగ్ బాస్ ఎవర్ని ఎలిమినేట్ చేయలేదు. అయితే రెండో వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. అభినయ శ్రీ, షానీ సల్మాన్ ఎలిమినేట్ అయ్యారు. మూడో వారంలో నేహా చౌదరి ఎలిమినేట్ అవ్వగా.. నాల్గవ వారంలో 10 మంది నామినేట్ అయ్యారు.

who is eliminated in this week in big boss telugu season 6 telugu
who is eliminated in this week in big boss telugu season 6 telugu

ఇక ఈ వారం నామినేషన్స్ విషయానికి వస్తే.. ఈసారి నామినేషన్స్ లో పదిమంది ఉన్నారు. వీళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది అందిరిలో ఉత్కంఠని కల్గిస్తోంది. అయితే ఇప్పటికే రేవంత్, ఇనయలు సేవ్ అయ్యారని తెలుస్తోంది. అంతేకాదు గీతూ రాయల్, శ్రీహాన్, కీర్తి భట్ కూడా సేఫ్ జోన్ లోకి వచ్చారని సమాచారం. ఇక మిగిలిన ఐదుగురు డేంజర్ జోన్ లో ఉన్నారని తెలుస్తోంది. ముఖ్యంగా రాజశేఖర్, ఆర్జే సూర్య, సుదీపలు డేంజర్ జోన్ లో ఉన్నారని సమాచారం. త్వరలో ఆర్జున్, ఆరోహిలకు మిగతా ముగ్గురితో పోలిస్తే బెటర్ ఓటింగ్ వస్తుందట. సుదీపకు మాత్రమే తక్కువ ఓటింగ్ వస్తోందని తెలుస్తోంది. మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి మరి.

Read Also : Big boss season 6 telugu: బిగ్ బాస్ ఆపేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel