Big boss season 6 telugu : బిగ్ బాస్ ఆపేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్..!

Pettition in ap high court to stop big boss telugu season6
Pettition in ap high court to stop big boss telugu season6

Big boss season 6 telugu : బిగ్ బాస్ తెలుగు 6 కు కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. ప్రస్తుతం ఆరో సీజన్ కూడా ఆసక్తికరంగా కొనసాగుతుంది. ఈ క్రమంలో కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు 6 కు బిగ్ షాక్ తగిలింది. ఏపీ హైకోర్టులో నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్ పై న్యాయస్థానం కూడా సీరియస్ గా స్పందించింది. బిగ్ బాస్ షోలో అశ్లీలత ఎక్కువగా ఉందంటూ.. దీంతో యువత పెడదారులు పట్టే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు పిటిషనర్.

Pettition in ap high court to stop big boss telugu season6
Pettition in ap high court to stop big boss telugu season6

అంతే కాకుండా షో టైమింగ్స్ లోనూ మార్పులు చేయాలని కోరారు. ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్ మార్గదర్శకాల ప్రకారం షోను టెలికాస్ట్ చేయాల్సి ఉన్నా ఫఆలో కావడం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటలలోపే ప్రసారం చేయాలని కోరారు. లేదంటే వెంటనే ఈషోను నిలిపివేయాలని న్యాయస్థానానికి విన్నవించారు. తాజాగా పిటిషన్ పై న్యాయస్థానం కూడా ఘాటుగా స్పందించినట్లు తెలుస్తోంది.

Advertisement

70లలో ఎలాంటి సినిమాలో వచ్చాయో తెలుసు కదా అని హైకోర్టు సూచంచినట్లు సమాచారం. ఈ మేరకు విచారణను హైకోర్టు అక్టోబర్ 11కు న్యాయస్థానం వాయిదా వేసింది. అదే రోజు షోపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.

Read Also : Big boss telugu6 : ఈ వారం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా?

Advertisement

 

Advertisement