Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో రిషి, వసు ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి దేవయాని వస్తుంది.
ఈరోజు ఎపిసోడ్ లో రిషి,వసుదార ని బయటికి పిలుచుకొని వెళ్లి ఈ చెట్లు ఆకాశం నీలా నీ స్నేహితులు అన్నావు కదా వాటి ముందే ఒక ప్రశ్న అడుగుతాను చెప్తావా అనడంతో వసుధార ఏమి అడుగుతాడు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు రిషి అందరు నన్ను అపార్థం చేసుకున్న నేను బాధపడలేదు కానీ నువ్వు కూడా దూరం పెట్టావు నువ్వు నాకు అబద్ధం చెప్పావు అంటూ సాక్షి వీడియో ని చూపిస్తాడు రిషి.
ఆ వీడియోని చూసిన షాక్ అవుతుంది వసుధార. సాక్షి గురించి నాకెందుకు చెప్పలేదు ఆ రోజు నేను ఎన్నిసార్లు అడిగినా నాకు గుర్తుకులేదు అని ఎందుకు అన్నావు అనగా వెంటనే వసుధార సాక్షి గురించి చెప్తే మీరు కోపంలో ఏమైనా చేస్తారని భయంతో చెప్పలేదు సార్ అని అంటుంది. అప్పుడు రిషి కోపంతో వసుధారపై అరుస్తాడు.
మన మధ్య ఏ దాపరికాలు ఉండకూడదు అన్నాను కదా మరి ఇదేంటి అని వసుదార ని ప్రశ్నిస్తాడు. అప్పుడు వసుంధర మీరు బాధ పెడతారు అని నేను చెప్పలేదు సార్ అనడంతో వెంటనే రిషి కోప్పడతాడు. అప్పుడు రిషి గురుదక్షిణ గురించి కూడా ప్రశ్నిస్తాడు. ఆ విషయం కూడా నాతో ఎందుకు చెప్పలేదు అని నిలదీస్తాడు రిషి.
నువ్వు జగతి మేడంని నాతో అమ్మ అని పిలిపించాలని నాతో ప్రేమగా దగ్గరికి అయ్యావా అని దానికోసమే నన్ను వాడుకున్నావా అని అనటంతో వెంటనే వసు షాక్ అయ్యి అలాంటిదేమీ లేదు అని అంటుంది. అప్పుడు వసు ఎంత చూపిన వినిపించుకోకుండా రిషి అలాగే కోపంగా మాట్లాడడంతో పసుధార బాధపడుతూ ఉంటుంది.
అప్పుడు రిషి ఇకపై ఈ విషయాలని మర్చిపో ఇకపై మన మధ్య ఏ దాపరికాలు ఉండకూడదు అని అంటాడు. అలాగే జగతి మేడం మీద నాకు మంచి అభిప్రాయం ఉంది.ఇకపై మన వద్ద జగతి మేడం ప్రస్తావన కూడా తీసుకురావద్దు అని చెప్పి అక్కడ నుంచి బయలుదేరుతారు. ఆ తర్వాత పూలు అమ్మే ఆమె రావడంతో ఆ పూలు తీసుకొని మధ్యలో విఆర్ అని రాసి ఆ ఫోటోని రిషికి పెడుతుంది వసుధార.
అప్పుడు బస్సు ద్వారా ఏం మాట్లాడకుండా ఉండడంతో రిషి వెంటనే ఫోన్ కట్ చేస్తాడు. ఇంతలోనే అక్కడికి జగతి వస్తుంది. అప్పుడు రిషి నాకు బంధాలు పోగొట్టుకోవడం అలవాటులే మేడం అని జగతిని బాధపెట్టే విధంగా మాట్లాడుతాడు. జగతి మాత్రం వసదారని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఉంటుంది.