వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Guppedantha Manasu Aug 4 Today Episode : మాస్టర్ ప్లాన్ వేసిన దేవయాని.. వసు పడిపోతుండగా పట్టుకున్న రిషి..?

Guppedantha Manasu Aug 4 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దేవయాని మాటలకు షాక్ అవుతుంది సాక్షి. ఈరోజు ఎపిసోడ్ లో సాక్షి మాట్లాడుతూ ఏంటి ఆంటీ మీరు కూడా రిషి కీ సపోర్ట్ చేస్తున్నారు అని అనగా వెంటనే దేవయాని సపోర్ట్ చేయడం కాదు ... Read more

By Ramesh Babu

Published on: August 4, 2022 8:26 AM

Updated on: August 4, 2022 10:23 AM

---Advertisement---

Guppedantha Manasu Aug 4 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దేవయాని మాటలకు షాక్ అవుతుంది సాక్షి. ఈరోజు ఎపిసోడ్ లో సాక్షి మాట్లాడుతూ ఏంటి ఆంటీ మీరు కూడా రిషి కీ సపోర్ట్ చేస్తున్నారు అని అనగా వెంటనే దేవయాని సపోర్ట్ చేయడం కాదు సాక్షి, రిషి నిన్ను ఇష్టపడటం లేదు నిన్ను ప్రేమించడం లేదు, రిషి నిన్ను పెళ్లి చేసుకోవడం లేదు అనటంతో సాక్షి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు దేవయాని మాటలకు సాక్షితో పాటు ఇంట్లో ఉన్న అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.

Guppedantha Manasu Aug 4 Today Episode
Guppedantha Manasu Aug 4 Today Episode

అప్పుడు సాక్షి అదేంటి ఆంటీ మొన్నటి వరకు నాకు సపోర్ట్ గా మాట్లాడి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు అని అనగా వెంటనే దేవయాని నీకు రిషికి పెళ్లి చేద్దామని అనుకున్న మాట వాస్తవమే కానీ మంచి మనసులో నువ్వు లేవు అని తెలిసినప్పుడు బలవంతంగా ఏం చేయగలుగుతాను సాక్షి అనడంతో సాక్షి ఆశ్చర్య పోతుంది. అప్పుడు నేనేంటో చూపిస్తాను అని సాక్షి అనగా ఏం చేసుకుంటావో చేసుకోపో అంటుంది దేవయాని.

అప్పుడు సాక్షి రెండే రెండు రోజుల్లో నాకు పిలుపు రాకపోతే అందరి ముందు ఇక్కడే సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను అని బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు కార్ చెడిపోవడంతో వసు,రిషి ఇద్దరు కారు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపు అక్కడికి ఒక అతను వచ్చి రిషి వాళ్లను వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తాడు. మరొకవైపు దేవయాని అందరి ముందు దొంగ ఏడుపులు ఏడుస్తూ నాటకాలు ఆడుతూ ఉంటుంది.

అప్పుడు గౌతమ్ ని పెద్దమ్మ కీ బాగాలేదు రమ్మని చెప్పు అని చెబుతుంది. అప్పుడు ఫణీంద్ర ఈ విషయం గురించి అందరూ వచ్చిన తర్వాత ఒకసారి చర్చించుకుందాం అని అంటాడు. అప్పుడు దేవయాని నా మైండ్ ఏంటో నా ఆలోచన ఏంటో ఎవరూ కనిపెట్టలేరు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. మరొకవైపు వసు, రిషి ఒక అతని ఇంటికి వెళ్లగా అక్కడ వాళ్ళందరూ కలిసి వారిద్దరికీ బాగా మర్యాదలు చేస్తూ ఉంటారు.

Guppedantha Manasu Aug 4 Today Episode : నేనేంటో చూపిస్తానన్న సాక్షి.. ఏం చేసుకుంటావో చేసుకో అన్న దేవయాని

అంతేకాకుండా మెకానిక్ రావడానికి సమయం పడుతుంది కాబట్టి భోజనం చేయండి అని కుటుంబం అడగడంతో రిషి సరే అని అంటాడు. ఆ తర్వాత ఆ రాత్రి వసుధార ఇంట్లో ఉన్న పిల్లలు చదువుకుంటున్న సమయంలో పక్కింట్లో కరెంటు ఉంది ఇక్కడ కరెంటు ఎందుకు పోయింది అని చూడటానికి వెళుతుంది వసుధార. మరొకవైపు దేవయాని ధరణిని తిడుతూ ఉంటుంది.

ఇంతలో జగతి అక్కడికి వచ్చి ఏమయింది అని అడగగా సాక్షి అందర్నీ కాకుండా నన్ను జైలుకు పంపిస్తాను అని అంటుంది మన కుటుంబం పరువు ఏమైపోతుంది అని బాధపడుతున్నాను అని అంటుంది దేవయాని. మరొకవైపు వసుధార కరెంటు చెక్ చేస్తూ ఉండగా ఫ్యూస్ పోయింది అని చెక్ చేస్తూ ఉండగా ఇంతలా కుర్చీలో నుంచి పడిపోతుండగా రిషి వచ్చి పట్టుకుంటాడు.

అప్పుడు వసుధార తన మనసులోని మాట చెబుదామని అనుకుంటూ ఉండగా ఇంతలో పిల్లలు కరెంటు వచ్చిందా అని అడగడంతో ఆ ఫ్యూజ్ అక్కడే పెట్టి కరెంట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత రిషి వాళ్ళు భోజనానికి వెళ్తారు. భోజనం చేసిన తర్వాత ఎలాగో మెకానిక్ రాలేదు కదా రాత్రికి ఇక్కడే ఉండండి అని రిషి వాళ్లను అడగగా రిషి సరే అని అంటాడు. మరొకవైపు దేవయాని నటిస్తుందా లేకపోతే నిజంగానే అలా మాట్లాడుతుందా అర్థం కాక కుటుంబ సభ్యులు అయోమయ పరిస్థితిలో ఉంటారు.

, , , , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel