Flipkart big billion days: ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022 రెండో రోజులోకి ఎంటర్ అయింది. స్మార్ట్ ఫోన్లు, టీవీలీ, ల్యాప్ టాప్ లు, స్మార్ట్ వాచ్ లపై భారీ డిస్కౌంట్లు ఊరిస్తున్నాయి. దీంతో పాటు ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఫ్లిప్ కార్డ్ యాక్సెస్ కార్డు హోల్డర్లకు 10 శాతం తక్షమ రాయితీ కూడా ఉంద. సేల్ సందర్భంగా వచ్చే కొత్త వినియోగదారులు సైన్ అప్ చేయడం ద్వారా 100 రూపాయల రాయితీని కూడా ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ఈ సేల్ సందర్భంగా బ్రాండెడ్ టీవీలు అత్యంత తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి స్మార్ట్ టీవీ కోసం కనుక ఎదురు చూస్తున్నట్లు అయితే అది చక్కని అవకాశమే.
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలి,యన్ డేస్ సేల్ 2022లో భాగంగా కొడక్ 7 ఏక్స్ ప్రొ, సిరీస్ 32 అంగుళాల హెచ్ డీ ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ 8 వేల 999 రూపాయలకే అందుబాటులో ఉంది. దీని అసలు ధర 18, 499 కాగా ఎక్స్ చేంజీలో భాగంగా 8 వేల ఆఫర్ ప్రకటించింది. అంటే పాత టీవీతో కనుక ఎక్స్ చేంజ్ చేసుకుంటే రూ.999 కే దీనిని సొంతం చేసుకోవచ్చు. ఐసీఐసీఐ, యాక్సెస్, ఫ్లిప్ కార్ట్ యాక్సెస్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 180 వరకు తగ్గింపు లభిస్తుంది.