Google free course: బిగ్ డేటా అనలటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ బేసిక్స్ నేర్చుకోవడానికి కంప్యూటింగ్ ఫండేషన్స్ విత్ కుబెర్నెట్స్ కోర్సును గూగుల్ లాంచ్ చేసింది. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు, ఎంట్రీ లెవెల్ ప్రొఫెషనల్స్ కోసం ఈ కోర్సును అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు తెలిపింది. ఈ కోర్సును అర్హత కల్గిన వ్యక్తులు ఉచితంగా పొందవచ్చని ప్రకటించింది. ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, పరిశ్రమల సంస్థ నాస్కామ్ కి చెందిన డిజిటల్ స్కిల్లింగ్ ఇనిషియేటివ్ సహకారంతో కోర్సును అందిస్తున్నట్లు గూగుల్ పేర్కొంది. క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలటిక్స్ బేసిక్స్ పై అవగాహన పెంచుకునేందుకు ఉన్నత విద్యా సంస్థల్లోని విద్యార్థులు కెరియర్ ప్రారంభ దశలోని గ్రాడ్యుయేట్ లకు ప్రోగ్రాం ఉపయోగపడుతుంది.
కోర్సును మొత్తం ఐదు విభాగాలుగా నిర్వహిస్తున్నారు. కోర్సు పూర్తి చేసిన తర్వాత నేర్చుకున్న అంశాలను ప్రాక్టీస్ చేయడానికి గూగుల్ క్లౌడ్ స్కిల్స్ బూస్ట్ ప్రోగ్రామ్ ద్వారా నైపుణ్య శిక్షణ కూడా అందించనున్నారు. గూగుల్ క్లౌడ్ లోని ఇంజినీరింగ్ వైస్ ప్రెసిడెంట్, ఇండియా డెవలప్ మంట్ సెంటర్ హెడ్ అనిల్ భన్సాలీ మాట్లాడుతూ… ప్రస్తుతం క్లౌడ్, డేటా అనలిటిక్స్ స్కిల్స్ కీలకం అని చెప్పారు. కంపెనీలు ఈరోజుల్లో క్లౌడ్ కు తమ క్లిష్టమైన వర్క్ లోడ్స్ ను తరలించి, వాటి డేటా ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని ఉన్నారు.