...

Vijay Devarakonda: ఆదర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్.. ఈ సినిమా హిట్ అయితేనే ఛాన్స్!

Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరియర్ పై ఊహించని దెబ్బ కొట్టింది లైగర్ సినిమా.ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో విడుదలైనప్పటికీ మొదటి షో తోనే డిజాస్టర్ సొంతం చేసుకోవడంతో ఒక్కసారిగా చిత్ర బృందం షాక్ అయ్యారు. ఇకపోతే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో విజయ్ దేవరకొండ ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలతో కాకుండా లవ్ స్టోరీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

Advertisement

ఈ క్రమంలోనే ఈయన హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమాలో చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా అనంతరం విజయ్ దేవరకొండ మరొక రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇక విజయ్ దేవరకొండ తన తదుపరిచిత్రాన్ని డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఉండబోతుందని సమాచారం వినపడుతుంది.ఎప్పటినుంచో దిల్ రాజు విజయ్ దేవరకొండతో సినిమా చేయాలని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే తనకు మంచి కథ ఇవ్వమని దర్శకులకు చెప్పినట్టు సమాచారం ఆదర్శకులలో ఇంద్రగంటి కూడా ఉన్నారని తెలుస్తోంది.

Advertisement

Advertisement

Vijay Devarakonda:

ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాన్ని ఇంద్రగంటి దర్శకత్వంలో చేయబోతున్నారని క్లారిటీ వచ్చింది.అయితే ఇక్కడ నిర్మాత దిల్ రాజు మాత్రం దర్శకుడికి ఓ కండిషన్ పెట్టినట్టు సమాచారం.ప్రస్తుతం ఈయన దర్శకత్వంలో వచ్చిన ఆ అమ్మాయి గురించి చెప్పాలి సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంటేనే తన బ్యానర్లో అవకాశం ఉంటుందనే కండిషన్ పెట్టారట.అయితే ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇప్పటికే ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది గాని కమర్షియల్ గా ఎలాంటి హిట్ అందుకుంటుందో తెలియదు. మరి ఈ సినిమా హిట్ అయితేనే విజయ్ ఇంద్రగంటి కాంబోలో మరో సినిమా రాబోతుందని తెలుస్తోంది.

Advertisement
Advertisement