Vastu Tips : మనదేశంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా కూడా వాస్తు శాస్త్రానికి మాత్రం చాలా ప్రాముఖ్యత ఉంది. అందువల్ల మన దేశంలో నూతన గృహాలు నిర్మించేటప్పుడు వాస్తు ప్రకారం ఇళ్లు నిర్మిస్తారు. ఎందుకంటే వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించకపోతే ఇంట్లో సుఖ సంతోషాలు ఉండకపోగా తరచు గొడవలు జరుగుతూ మనశ్శాంతి కరువవుతుంది.అంతే కాకుండా అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలలో కూడా సతమతమవుతారు. అందువల్ల కొత్త ఇంటిని నిర్మించేటప్పుడు వాస్తు ప్రకారం ఇళ్ళను నిర్మిస్తున్నారు.
అయితే వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించిన కూడా ఇంట్లో కొన్ని వాస్తు నియమాలు పాటించకపోవటం వల్ల కూడా ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. అందువల్ల ఈ వాస్తు నియమాలను తప్పనిసరిగా పాటించాలి. మనం పాటించాల్సిన వాస్తు నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించినా కూడా మనం తెలియకుండా చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఇంట్లో సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఇంటి ప్రవేశ ద్వారాన్ని తూర్పు, ఉత్తరం వైపు ఉండేలా చూసుకోవాలి. అంతేకాకుండా ప్రవేశ ద్వారానికి ఎదురుగా ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పులు, చీపురు వంటి వస్తువులను ఉంచరాదు.
Vastu Tips : వాస్తు దోషాలు లేకుండా ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
ఇక ఇంట్లో పూజ గది ఎప్పుడు ఈశాన్య దిశ వైపు ఉండేలా చూసుకోవాలి. ఇక ప్రస్తుతం చాలామంది వంటగదిలోని పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే పూజ చేసే ప్రాంతాన్ని వంట చేసే ప్రాంతాన్ని వేరు చేస్తూ ఒక అడ్డుగోడ తప్పనిసరిగా ఉండాలి. ఇక మనం ఎల్లప్పుడూ తూర్పు దిశ వైపు తిరిగి వంట చేసేలా వంట గదిని ఏర్పాటు చేసుకోవాలి. ఇక ఇంటి ప్రవేశ ద్వారం ధ్వంసం అయితే ఆలస్యం చేయకుండా ప్రవేశద్వారాన్ని మళ్లీ నిర్మించాలి. అంతేకాకుండా ఇంటితోపాటు ప్రవేశద్వారంలో కూడా ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. దీంతో ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలు కూడా దూరమై ఇంట్లో అదృష్టం తాండవిస్తుంది.
Read Also : Horoscope : ఇవాళ ఈ రాశుల వారికి లక్కే లక్కు.. పట్టిందల్లా బంగారమే!
Tufan9 Telugu News And Updates Breaking News All over World