Intinti Gruhalakshmi September 9 Today Episode : బయటపడ్డ నందు,లాస్య నిజస్వరూపం.. కోపంతో రగిలిపోతున్న సామ్రాట్..?

Updated on: September 9, 2022

Intinti Gruhalakshmi September 9 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో సామ్రాట్ హనీకు సారీ చెప్పి కూల్ చేస్తూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్లో హనీ అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత సామ్రాట్ వాళ్ళ బాబాయ్ సామ్రాట్ తో ఇకపై నువ్వు హనీకి అబద్ధం చెప్తే తను నీతో మాట్లాడను అని అంది గుర్తుపెట్టుకో అని అంటాడు. ఆ తర్వాత లాస్య కొడుకు లక్కీ షాప్ కి వెళ్లి డ్రాయింగ్ షీట్స్ కొంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి హనీ వస్తుంది. అలా వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా ఇంతలోపు దివ్య తులసి ఇద్దరు వినాయక చవితి షాపింగ్ చేస్తూ ఉంటారు.

Samrat gets shocked as Honey informs him about Tulasi's in todays intinti gruhalakshmi serial episode
Samrat gets shocked as Honey informs him about Tulasi’s in todays intinti gruhalakshmi serial episode

అప్పుడు హనీ తులసిని చూసి పరిగెత్తుకుంటూ వెళుతుంది. అప్పుడు మీరు ఊరు వెళ్లారని మా డాడీ చెప్పారు ఆంటీ అనడంతో సరే అని అంటుంది. లక్కీ అక్కడికి వచ్చి తులసి వాళ్ళని మాట్లాడిస్తాడు. అప్పుడు దివ్య చేతిలో వినాయకుడి బొమ్మ చూసి ఎందుకు ఆంటీ ఇది అని అడగగా రేపు ఇంట్లో వినాయక చవితి పూజ చేస్తున్నాము అని అంటుంది దివ్య. ఇప్పుడు వెంటనే హనీ నేను కూడా వస్తాను ఆంటీ అని అంటుంది.

అప్పుడు లక్కీ నేను కూడా వస్తాను ఆంటీ అనడంతో సరే అని అంటుంది తులసి. మరొకవైపు శృతి ఫోన్లో నాకు కొంచెం డబ్బులు కావాలి అవసరం ఉంది అని ఎవరినో అడుగుతూ ఉండగా ఆ మాటలు విన్న ప్రేమ్ ఎందుకు శృతి నా నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావు. మన మధ్య ఎన్ని గొడవలు ఉన్నా నువ్వు ఈ ఇంటి కోడలివి నా భార్యవి నువ్వు ఇంట్లో ఉన్నంతవరకు నీ బాధ్యత నాదే అని అంటాడు ప్రేమ్.

Advertisement

నీకు నాతో మాట్లాడటం లేకపోతే కనీసం మెసేజ్ అయినా పెట్టు నీకు ఏం కావాలో అడుగు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు హనీ సామ్రాట్ దగ్గరికి వచ్చి నేను ఇందాక తులసి ఆంటీ ని చూశాను ఊరు నుంచి వచ్చారట అనడంతో సామ్రాట్ ఆశ్చర్యపోతాడు. అంతే కాదు నాన్న రేపు నేను తులసి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని అంటుంది హని.

Intinti Gruhalakshmi September 9 Today Episode: కోపంతో రగిలిపోతున్న సామ్రాట్..

వినాయక చవితి పండుగ కోసం నన్ను ఆంటీ పిలిచారు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది హని. అప్పుడు చూశారా బాబాయ్ ఇంత చేసినా కూడా ఏమీ తెలియనట్టుగా హనీ నీ వాళ్ళ ఇంటికి పిలిచింది అని అంటాడు సామ్రాట్. మరొకవైపు దివ్య తులసి ఇంటికి రాగా అప్పుడు దివ్య అమ్మా నీ మొహమాటం వల్లే నువ్వు కోరి సమస్యలు తెచ్చుకుంటున్నావు అనిపిస్తుంది అని అనటంతో ఏమైంది దివ్య అని అడగగా ఆ సామ్రాట్ గారు అన్ని మాటలు అన్నా కూడా నువ్వు మళ్ళీ హనీ ని ఎందుకు పిలిచావు అని అంటుంది.

అప్పుడు తులసి నేను ఏ తప్పు చేయలేదు దివ్య పిల్లలు మనసులు బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అందుకే పిలిచాను అని అంటుంది. మరొకవైపు లక్కీ తులసి ఇంటికి ఏ బట్టలు వేసుకోవాలా అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో నందు లాస్య అక్కడికి రావడంతో వారికి అసలు విషయాలు చెబుతాడు. అప్పుడు లాస్య నిన్ను ఒక్కదాన్నే పిలిచిందా లేక మమ్మల్ని పిలిచిందా అని అడగగా వెంటనే లక్కీ తెలిసి తెలిసి తలనొప్పిని ఎవరూ కొని తెచ్చుకోరు కదా అని అంటాడు. లక్కీ మాటలకు నందు, లాస్య ఇద్దరు షాక్ అవుతారు.

Advertisement

ఇక రేపటి ఎపిసోడ్ లో లక్కీ తులసి ఇంటికి వచ్చి హడావిడి చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత నందు లాస్య బయట నిలబడి జరిగిన విషయాలు అన్నీ కూడా తలుచుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఆ మాటలు అన్నీ కూడా పక్కనే కార్లో కూర్చున్న సామ్రాట్ వింటూ ఉంటాడు. ఇక తులసి నందుల ప్లాన్లు అన్ని తెలిసి నందు షాక్ అవుతాడు.

Read Also : Intinti Gruhalakshmi September 8 Today Episode : తులసి మీద కోపాన్ని హనీ మీద చూపించిన సామ్రాట్.. ఆనందంలో నందు, లాస్య..?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel