Intinti Gruhalakshmi: సామ్రాట్ కి అసలు నిజం చెప్పేస్తాను అంటున్న నందు.. షాక్ లో తులసి..?

Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో నందు, లాస్య ఇద్దరూ జరిగిన విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు.

ఈరోజు ఎపిసోడ్ నందు,లాస్యతో మాట్లాడుతూ ఎందుకు అందరూ జరిగిన తప్పు అంతా నా వల్లే అనుకుంటున్నారు నేనేం చేశాను లాస్య అని అనగా అప్పుడు లాస్య ఏమీ తెలియనట్టుగా ఏం కాదులే ధైర్యంగా ఉండు అని నందుకు ధైర్యం చెబుతుంది. అప్పుడు నందు నేను ఇప్పటినుంచి ఇంకా ఆ ఇంటికి వెళ్ళను గడప తొక్కను అని అనడంతో వెంటనే లాస్య అక్కడికి వెళ్లకుండా నీ ప్రవర్తనలో మార్పు వస్తే తప్పంతా నువ్వే చేశావని నీ మీదే నింద మోపుతారు అని అంటుంది లాస్య.

Advertisement

కాబట్టి ఇప్పుడు ధైర్యంగా ఉండు మనిద్దరం కలిసి ఆ తులసిని దెబ్బ కొడదాము. సామ్రాట్ కంపెనీకి వెళ్లి మళ్లీ జాయిన్ అవుదాము అనడంతో నందు ఆశ్చర్యపోతాడు. మరొకవైపు అనసూయ పరంధామయ్య తులసి గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి తులసి వస్తుంది. అప్పుడు క్రేజీ సామ్రాట్ గారికి నా మొహం ఎలా చూపించాలి అత్తయ్య అని మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే అభి అక్కడికి వచ్చి ఎప్పుడు నీ స్వార్థం గురించే చూసుకుంటున్నావు.

ఇప్పుడు మ్యూజిక్ స్కూల్ తప్ప ఇంకేమీ ఉండదా అని అనగా ఇంతలోనే అక్కడికి అంకిత వస్తుంది. అప్పుడు అంకిత అసలు స్వార్థం గురించి నువ్వు మాట్లాడుతున్నావా అభి. తులసి ఆంటీకి ఎప్పుడు పక్కవారి గురించి ఆలోచించడమే తప్ప తన గురించి ఆలోచించడం తెలియదు అని అనగా వెంటనే పరంధామయ్య నీ స్వార్థం గురించి నువ్వు ఆలోచించుకొని నువ్వు మీ అత్త వాళ్ళ ఇంటికి పోలేదా అని ఎంతో అభి మౌనంగా ఉంటాడు.

అప్పుడు అభి ఇదంతా మంచికే జరిగింది ఆయన స్కూల్ ఇప్పుడే ఆగిపోయింది లేకపోతే సామ్రాట్ పక్కన అమ్మని చూడాల్సి ఉండేది అనడంతో అందరూ అభినే అసహ్యించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత నందు లో మార్పు చూసి లాస్య ఆనంద పడుతూ ఉంటుంది. ఇంతలోనే అనసూయ నందు కి ఫోన్ చేసి నువ్వు చేసిన తప్పులు నువ్వే సరిదిద్దుకోవాలి సామ్రాట్ దగ్గరికి వెళ్లి నువ్వే నిజం చెప్పు అనడంతో వెంటనే ఆ విషయం చెప్పడంతో నేను చాలా నష్టపోతాను అది నాకు అనవసరం అని చెప్పి ముఖం మీద ఫోన్ కట్ చేస్తాడు నందు.

Advertisement

అప్పుడు నందు, లాస్య ఇద్దరు సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అంకిత బాధపడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి అవి రావడంతో అభి ని అసహ్యించుకుంటూ మాట్లాడుతుంది అంకిత. నేను ఇక్కడికి రాకుండా మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండాల్సి ఉండేది అప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ మనశ్శాంతిగా ఉండేది అంటూ అభి పై ఫైర్ అవుతుంది.

అప్పుడు అంకిత తల్లినే ఈ విధంగా చూసుకుంటున్నావు అంతే ఇంకొంచెం పెద్దయ్యాక నామీద అభిప్రాయ భేదాలు వస్తాయి నాకు భయం వేస్తుంది ఒక తల్లిని సరిగ్గా చూసుకొని నువ్వు భార్యని ఎలా చూసుకుంటావు అని అంటుంది అంకిత. రేపటి ఎపిసోడ్ తులసి నందు వాళ్ళ ఇంటికి వెళ్లి అసలు నిజాన్ని ఒప్పుకోమని చెప్పగా లాస్య నందు ఇద్దరు తులసి వైపు నవ్వుతారు. అప్పుడు నందు నేనే హనీ కి యాక్సిడెంట్ చేశాను అన్న విషయాన్ని నేను చెప్పేస్తాను అనడంతో తులసి ఒక్కసారిగా షాక్ అవుతుంది.

Advertisement

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel