MLC Kavitha : తెలంగాణలో అధికారపార్టీ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ప్లీనరీ ఎంత గ్రాండ్ సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఎప్పటిలాగే సీఎం కేసీఆర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ సభ గురించి ఏపీ రాజకీయాల్లోనూ జోరుగా చర్చ నడిచింది. అక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయాలని పలు విన్నపాలు వస్తున్నాయని కేసీఆర్ చెప్పుకొచ్చారు. రాష్ట్రం రాకముందు ఎలా దగా పడ్డాం.. సమైక్యాంధ్ర పాలనలో ప్రజలు ఎంత గోస పడ్డరు.. రాష్ట్రం ఆవిర్భవించాక.. కేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణ ఎలా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందో అని ప్రసంగం సాగించారు.
ఇదంతా ఒక ఎత్తయితే ప్లీనరీ మొత్తంలో ఉద్యమ కారులు ఎవరూ కనిపించలేదు. ఈటల ఎలాగు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. హరీష్ రావు హుజురాబాద్ ఎన్నికల్లో బిజీగా మారారు. కేవలం తండ్రి కొడుకులు మాత్రమే ప్లీనరీ ఆద్యంతం హైలెట్ అయ్యారు. కేసీఆర్ తర్వాత రారాజు కేటీఆర్ అని అందరికీ తెలిసిందే. దీంతో ప్లీనరీ మొత్తం మీడియా కేటీఆర్‌ను ఫోకస్ చేసింది.
అయితే, కేసీఆర్ ముద్దుల కూతురు, ఎమ్మెల్సీ కవిత మాత్రం ప్లీనరీలో కనిపించలేదు. తెలంగాణ ఉద్యమంలో ఆమె కూడా కీలక పాత్ర పోషించారు. జాగృతి పేరుతో చాలా కార్యక్రమాలు నిర్వహించారు. కానీ ఇటీవల ఆమె పార్టీలో అంత యాక్టివ్‌గా కనిపించడం లేదని తెలుస్తోంది. ఆ వాదనకు బలం చేకూరేలా ప్లీనరీకి కవితక్క రాకపోవడాన్ని అందరూ ప్రశ్నిస్తున్నారు. దీనికి కారణం ఏమై ఉంటుందని ఆరా తీస్తున్నారు. మొన్నటివరకు కేటీఆర్‌కు కవితకు మధ్య మనస్పర్దలు వచ్చాయని, అందుకే ఆమె ప్లీనరీకి రాలేదని అనుకుంటున్నారు.
ఈ క్రమంలోనే కొంతకాలంగా కవిత ప్రాధాన్యతను పార్టీలో తగ్గించారని తెలిసింది. ఆమె ఏదైనా చెబితే అది జరగడం లేదంట.. అంతా కేటీఆర్ కనుసన్నల్లోనే పార్టీ నడుస్తుందని పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజాగా ప్లీనరీలో కూడా ఆమె కనిపించకపోవడం, సభ మొత్తం కేటీఆర్ హైలెట్ అవ్వడం కూడా అందులో భాగమేనని.. కేసీఆర్ తర్వాత టీఆర్ఎస్ పార్టీకి అసలైన వారసుడు కేటీఆర్ అని ప్రకటించేందుకు కవితను దూరం చేసినట్టు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
ఇకపోతే అందులో ఏమాత్రం వాస్తవం లేదని.. కవితకు ఆరోగ్యం బాగాలేకనే.. ఆమె రాలేదని చెబుతున్నారు. ఒకవేళ అదే నిజమైతే.. ప్లీనరీలో ఈ విషయాన్ని ఏదో ఒక సందర్భంలో ప్రకటిస్తే బాగుండని అందరూ అనుకుంటున్నారు.
Read Also : Huzurabad By-election : కేసీఆర్ నిజంగా భయపడ్డారా..? ఈ అతిజాగ్రత్తకు కారణమేంటి..? ఆయన వ్యూహామేంటి?
Tufan9 Telugu News providing All Categories of Content from all over world