Karthika Deepam Aug 25 Today Episode : తెలుగు బుల్లి తెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆగట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో సౌందర్య కార్తీక్,దీప లను తలచుకుని ఎమోషనల్ అవుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో దీప, మోనిత మీద అనుమానంతో మోనితను ఫాలో అవుతూ వెళ్తుంది. మౌనిత మాత్రం కార్తీక్ తన దగ్గర లేడు అన్న విధంగా ఎమోషనల్ దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటుంది. కానీ దీప మాత్రం మోనిత ని అసలు నమ్మదు. ఆ తర్వాత మోనిత ఇంట్లోకి వెళ్లిన దీప అక్కడ ఎక్కడ చూసినా కూడా కార్తీక్ ఫోటో చూసి షాక్ అవుతుంది.

కార్తీక్ ఫోటో ని చూసి మోనిత దొంగ ఏడుపులు ఏడుస్తూ నటిస్తూ ఉంటుంది. కార్తీక్ ఫోటో వైపు చూస్తూ మాట్లాడుతూ ఉండగా అప్పుడు దీప వెళ్ళి ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఇక మోనిత ఇంట్లో ఎక్కడ చూసినా కూడా గోడలపై కార్తీక్ ఫోటోలు, కార్తీక్ అనే పేరు రాసి ఉండడంతో అదంతా చూసి దీప షాక్ అవుతుంది. ఇక అక్కడ డాక్టర్ బాబు కనిపించకపోయేసరికి మోనిత నాటకం ఆడుతుందా లేక కావాలనే ఇలా చేస్తుందా.
Karthika Deepam Aug 25 Today Episode : మోనిత డ్రైవర్ శివని నిలదీసిన దీప…
మరి డాక్టర్ బాబు ఎవరి దగ్గర ఉన్నాడు అంటూ ఆలోచనలో పడి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు సౌందర్య కొడుకు కోడలి ఫోటోలను చూసి ఎమోషనల్ అవుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి ఆనంద్ రావు, హిమ షాపింగ్ చేసి వస్తారు. అప్పుడు హిమా సంతోషంగా సౌర్య కోసం షాపింగ్ చేశాను అని అంటుంది. హిమ,సౌర్య గురించి మాట్లాడుతూ ఉండగా సౌందర్య మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది.
ఆ తర్వాత సౌందర్య, ఆనంద్ రావ్,హిమ, సౌర్య గురించి ఎమోషనల్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు దీప కార్తీక్ ఫోటో పట్టుకుని రోడ్డుపై వెతుకుతూ ఉంటుంది. అప్పుడు అటుగా వెళుతున్న కార్తీక్ తన డ్రైవర్ శివని కారు ఆపమని చెబుతాడు. అప్పుడు ఆమె మొన్న నన్ను కలిసింది కదా నేను వెళ్లి మాట్లాడి వస్తాను అని అనటంతో అప్పుడు శివ ఈయన ఆవిడను కలిస్తే మా మేడం నన్ను చంపేస్తుంది అని లో లోపల భయపడుతూ ఉంటాడు.
అయినా కూడా కార్తీక్ శివ మాట వెళ్లకుండా దీప దగ్గరికి వెళ్తాడు. ఇక అప్పటికే దీప ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత దీప డాక్టర్ వాళ్ళ అమ్మతో మోనిత గురించి చెప్పగా ఆమె దీపకు ధైర్యం చెబుతుంది. రేపుటి ఎపిసోడ్లో డ్రైవర్ శివ ని పట్టుకొని దీప గట్టిగా నిలదీయడంతో అతను భయపడుతూ ఉంటాడు. ఏం చెప్తావా లేక పోలీసులకు పట్టించాలా అని అనటంతో అప్పుడు శివా నిజం చెబుతాను అంటాడు. మరోవైపు మోనిత,కార్తీక్ కు ప్రేమగా భోజనం తినిపిస్తూ ఉంటుంది.
Read Also : Karthika Deepam Aug 24 Today Episode : ఎదురుపడిన మోనిత, దీప.. కోపంతో రగిలిపోతున్న డాక్టర్ బాబు..?
- Karthika Deepam serial Oct 17 Today Episode : దుర్గ కాళ్లు పట్టుకొని బ్రతిమలాడిన మోనిత..సంతోషంలో దీప..?
- Karthika Deepam: నిరూపమ్ ఫోటో చూపించి తనే నా మొగుడు అంటున్న సౌర్య.. కుటుంబ సభ్యులకు షాక్ ఇచ్చిన హిమ!
- Karthika Deepam Dec 27 Today Episode : హిమ బాధను చూసి కుమిలిపోతున్న దీప.. దీపను చంపడానికి మరొక ప్లాన్ వేసిన చారుశీల?













