Vijay Devarakonda: ఆ విషయంలో పవన్, బన్నీని వెనక్కి నెట్టేసిన విజయ్ దేవరకొండ..?

Vijay Devarakonda: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట పెళ్లిచూపులు సినిమాతో హీరోగా విజయ్ అతి తక్కువ సమయంలో ఊహించని విధంగా భారీ పాపులారిటీని సంపాదించుకున్నాడు. అంతేకాకుండా అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మంచి గుర్తింపు ఏర్పరచుకున్నాడు. ఇక టాలీవుడ్ లో బాలీవుడ్ లో ఈయనకు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలో ఉందో మనందరికీ తెలిసిందే. కాకుండా టాలీవుడ్ తో పాటు బాలీవుడ్లో పలువురు హీరోయిన్ సైతం విజయ్ దేవరకొండ తో డేటింగ్ చేయడానికి రెడీ అంటున్నారు అంటే ఈ హీరోకి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఇలా ఉంటే రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటించిన పాన్ ఇండియా చిత్రం లైగర్.

ఈ సినిమా రేపు అనగా ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్నాడు. లైగర్ సినిమాకు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇందులో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే విజయ్ దేవరకొండ అదిరిపోయే రికార్డులను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. కాగా లైగర్ సినీమా ఇప్పటికే ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. అంతేకాకుండా విజయ్ దేవరకొండ కెరియర్ లోనే ఈ సినిమా టాప్ సినిమాగా నిలవబోతోంది.

Advertisement

ఇప్పటికే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 62 కోట్లకు బిజినెస్ చేస్తుంది. అదేవిధంగా మిగిలిన ప్రాంతాల రైట్స్ అన్ని కలిపి దాదాపు రూ. 88.40 కొట్ల మేర బిజినెస్ జరిగింది. ఇకపోతే లైజర్ సినిమా తెలుగు రాష్ట్రాలలో అత్యధిక థియేటర్లలో విడుదల కానుంది. నైజాం లో 320, సీడెడ్ లో 190 థియేటర్లలో విడుదల కానుంది. ఆంధ్రా తో పాటు అన్ని ప్రాంతంలో కలిపి దాదాపు 420లలో విడుదల కానుంది. ఆ ప్రకారంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్,తెలంగాణలో కలిపి మొత్తం 930కి పైగా థియేటర్ లలో విడుదల కానుంది. అయితే మొత్తం గా చూసుకుంటే దేశవ్యాప్తంగా ఈ సినిమా 3000 థియేటర్లలో విడుదల కానుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే దాదాపుగా 3 వేలకు పైగా థియేటర్లలో విడుదల కానుంది అని సమాచారం. కాగా ఈ విషయంలో పవన్ కళ్యాణ్,అల్లు అర్జున్ ని వెనక్కి నెట్టేసాడు విజయ్ దేవరకొండ. పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా 2800 థియేటర్లలో విడుదల కాగా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా 3000 థియేటర్లలో విడుదల కానుంది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel