Sri Reddy : పిల్లల పెంపకం గురించి శ్రీ రెడ్డి షాకింగ్ కామెంట్స్… మీరైనా బాగుపడండి అంటూ హితబోధ!

Updated on: August 19, 2022

Sri Reddy : శ్రీ రెడ్డి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వివాదాలలో నిలుస్తూ ఉంటుంది. శ్రీ రెడ్డి నోరు తెరిస్తే చాలు బూతు పురాణమే. ముఖ్యంగా ఇండస్ట్రీలోని కొందరు పెద్దల గురించి మరికొందరు రాజకీయ నాయకుల గురించి శ్రీరెడ్డి ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. పొరపాటున కూడా ఎవరైనా శ్రీ రెడ్డిని గెలిచారంటే వాళ్ళకి మూడినట్లే లెక్క. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వివాదం వల్ల శ్రీ రెడ్డి పాపులర్ అయ్యింది. ఈ వివాదం వల్ల ఇండస్ట్రీలో అవకాశాలు లేక శ్రీరెడ్డి ఇండస్ట్రీకి దూరమైంది.

sri reddy Fish Curry
sri reddy Fish Curry

అయినప్పటికీ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలపై మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. శ్రీ రెడ్డి తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక రకాల వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవల శ్రీ రెడ్డి వంటలక్కగా అవతారం ఎత్తి వంటలు వీడియోలు చేస్తూ.. యూట్యూబ్ లో షేర్ చేస్తూ ఉంటుంది. పల్లెటూరి పిల్లలాగా కట్టుబొట్టు మార్చి పల్లెటూరి యాసలో మాట్లాడుతూ వివిధ రకాల వంటలను తయారు చేసి అందరికీ రుచి చూపిస్తోంది. శ్రీ రెడ్డి చేసే అందాల ఆరబోత కూడా కుర్రాళ్ళని బాగా ఆకట్టుకుంటుంది.ప్రకృతి అందాల నడుమ ఇలా వంటలు తయారు చేస్తూ వయ్యారాలు వలకబోస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది.

sri reddy Fish Curry
sri reddy Fish Curry

Sri Reddy: కింగ్ చేప పెద్ద సెన కూర..

ఎప్పుడు ఇతరుల మీద విమర్శలు చేస్తూ విరుచుకుపడే శ్రీరెడ్డి ఈ మధ్యకాలంలో నీతి సూక్తులు కూడా చెబుతోంది. ఇటీవల శ్రీకాకుళం స్టైల్ లో కింగ్ చేప పెద్ద సెన కూర ఎలా వండాలో అందరికీ వివరించింది. ఈ క్రమంలో శ్రీ రెడ్డి పిల్లల పెంపకం గురించి కూడా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. చిన్నపిల్లల మనసు చాలా సున్నితంగా ఉంటుందని, ముఖ్యంగా చదువు విషయంలో తల్లిదండ్రులు పిల్లలను ఎక్కువగా ఒత్తిడి చేయవద్దు అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా సమాజంలో స్త్రీలు బయటకు వెళ్ళినప్పుడు ఎలాంటి దుస్తులు ధరించాలి అన్న విషయం గురించి కూడా నీతులు వల్లించింది. స్త్రీలు ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు శరీరం మొత్తం కప్పుకునేలా దుస్తులు ధరించాలని, ఒకప్పుడు అలా చేయకపోవడం వల్లే మేము చెడిపోయాము.. కనీసం మీరైనా చెడిపోకుండా ఉంటారని ఈ విషయాలు చెబుతున్నా అంటూ వెల్లడించింది.

Advertisement

Read Also : Sri Reddy Video : గోరంట్ల మాధవ్ న్యూడ్‌గా ఉంటే.. మీకేంటి నొప్పి.. బూతులతో రెచ్చిపోయిన శ్రీరెడ్డి.. వీడియో

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel