Karthika Deepam Aug 12 Today Episode : హిమ పై కోప్పడిన సౌందర్య.. పెళ్లి ఆపే ప్రయత్నంలో ప్రేమ్, హిమ..?

Updated on: August 12, 2022

Karthika Deepam Aug 12 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సౌర్య తన ఫ్లాష్ బ్యాక్ మొత్తం తలుచుకొని బాధపడుతూ ఉంటుంది.  ఈరోజు ఎపిసోడ్ లో సౌందర్య, సౌర్య ఇద్దరు గతంలో జరిగిన విషయాలను తలుచుకొని బాధపడుతూ ఉంటారు. అప్పుడు సౌర్య ఇక్కడికి నన్ను మీరు బలవంతంగా తీసుకొని వచ్చారు ఇక్కడ ఎవరు నాకు సొంత మనుషుల్లా అనిపించడం లేదు అని అనడంతో సౌందర్య బాధపడుతుంది. ఇంతలోనే హిమ అక్కడికి వచ్చి నాది ఎంత బాధ్యత ఉందో నీకు అంతే బాధ్యత ఉంది అని అనడంతో హిమ పై ఫైర్ అవుతుంది.

Hima gets worried about her marriage to Nirupam in todays karthika deepam serial episode
Hima gets worried about her marriage to Nirupam in todays karthika deepam serial episode

అప్పుడు హిమ, నేను ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాను సౌర్య నీకు నిరుపమ్ బావకి ఎలాగైనా పెళ్లి చేస్తాను అనగా వెంటనే సౌందర్యం దంపతులు ఆ ఆలోచనలు మనసులో నుంచి బయటికి తీసేయ్ అని తిడతారు. మరోవైపు ప్రేమ్ తన గదిలో కూర్చొని హిమ ఫోటో చూసుకుంటూ మురిసిపోతూ ఉండగా ఇంతలో అక్కడికి నిరుపమ్ అక్కడికి వచ్చి ప్రేమ్ ఫోన్ లాక్కోవడంతో ప్రేమ్ తిరిగి ఫోన్ లాక్కుంటాడు.

Karthika Deepam Aug 12 Today Episode :  పెళ్లి ఆపే ప్రయత్నంలో ప్రేమ్, హిమ..?

Hima gets worried about her marriage to Nirupam in todays karthika deepam serial episode
Hima gets worried about her marriage to Nirupam in todays karthika deepam serial episode

ఇంతలోనే స్వప్న వాళ్ళు అక్కడికి రావడంతో అందరు ప్రేమ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు సౌందర్య కుంటుంబం అందరు కలిసి భోజనం చేస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి స్వప్న, సత్యం లు వస్తారు. అప్పుడు స్వప్న నా మేనకోడళ్లకు చీరలు తెచ్చాను అనడంతో సౌర్య తినకుండా చేయి కడిగి స్వప్న మీద సీరియస్ అయ్యి ఈ పెళ్లి త్వరగా అయిపోతే నా దారి నేను చూసుకుంటాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శౌర్య.

Advertisement

ఆ తరువాత ప్రేమ్, హిమ గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి నిరుపమ్ వచ్చి ఎందుకు ఇలా వున్నావ్ అని అనగానే ప్రేమ్ ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. అప్పుడు నిరుపమ్,ప్రేమ్ ని ఎంత అడిగిన కూడా ప్రేమ్ మౌనంగా ఉంటాడు. మరోవైపు హిమ, సౌర్య దగ్గరికి వెళ్ళి సౌర్య తో ప్రేమ గా మాట్లాడగా సౌర్య మాత్రం హిమ పై కోప్పడి హిమ ను తన రూమ్ నుంచి బయటకు గెంటేస్తుంది.

ఆ తరువాత సౌర్య, ఒంటరిగా కూర్చొని ఉండగా అప్పుడు ఆనంద్ రావ్, స్వప్న ఇంటికి రావడానికి కారణం నువ్వే సౌర్య అంటూ సౌర్య ని పోగుడుతూ హిమ గురించి మాట్లాడటంతో సౌర్య కోపంతో అక్కడి నుంచి వెళ్ళి పోతుంది. మరోవైపు హిమ ఒంటరిగా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో సౌందర్య చీర కట్టుకొ అని చెప్పగా ఎందుకు నానమ్మ అని అనగా వెంటనే సౌందర్య, హిమ పై కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తరువాత ప్రేమ్ అక్కడికి రావడంతో హిమ, నిరుపమ్ ఎలా అయినా పెళ్లి ఆపాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు.

Read Also : Karthika Deepam: సౌర్య పై కోపంతో రగిలిపోతున్న శోభ.. స్వప్న పై కోప్పడిన సౌర్య..?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel