Bandla Ganesh : బండ్ల గణేశ్.. ఈ పేరు వింటే చాలు.. అదో సంచలనం.. బండ్లన్న మాటలు తూటాల్లా పేలుతుంటాయి. ఆయన మాటలకు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకోవాల్సిందే.. ముక్కు సూటిగా ఏదైనా సరే కుండలు బద్దలు కొట్టి చెప్పేస్తాడు. తనకు అనిపించింది ముఖం మీదనే చెప్పేస్తుంటాడు. బండ్ల గణేశ్ ఏం మాట్లాడినా సెన్సేషనే.. ఆయన మాటకు ట్విట్ కు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన ఏం మాట్లాడిన అదో పెద్ద హట్ టాపిక్ అవుతుంది. అలాంటిది ఇప్పుడు బండ్ల గణేశ్ రౌడీ హీరో లైగర్ బాయ్ విజయ్ దేవరకొండపై గురిపెట్టాడు.
ఎందుకో తెలుసా? దేవరకొండ చేసిన షాకింగ్ కామెంట్లపై బండ్ల గణేశ్ స్పందించాడు. ట్విట్టర్ వేదికగా దేవరకొండను ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశాడు. లైగర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా విజయ్ దేవరకొండ నెపోటిజంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.
Bandla Ganesh : టాలెంట్ కూడా ఉండాలి.. ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్‌లా గుర్తు పెట్టుకో బ్రదర్..
‘మీకు మా అయ్య తెల్వదు.. మా తాత అంతకంట తెల్వదు. ఎవ్వడూ తెల్వదు.. రెండేళ్లవుతుంది.. సినిమా రిలీజై.. ముందు రిలీజైన మూవీ పెద్దగా చెప్పుకునేలే లేదు. అయినా ఈ ట్రైలర్‌కి రచ్చేందిరా నాయనా.. అంటూ దేవరకొండ కామెంట్లు చేశాడు. అయితే రౌడీ బాయ్ చేసిన కామెంట్స్ మెగా హీరోను ఉద్దేశించేనని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ఇదే సమయంలో బండ్ల గణేశ్ ట్విట్టర్ వేదికగా ఎంట్రీ ఇచ్చాడు.
తాతలు తండ్రులు ఉంటే సరిపోదు టాలెంట్ కూడా ఉండాలి ఎన్టీఆర్ ల మహేష్ బాబు లా రామ్ చరణ్ లా ప్రభాస్ లా గుర్తుపెట్టుకో బ్రదర్ 🔥🔥🔥🔥 @AlwaysRamCharan @tarak9999 @urstrulyMahesh 🐅🐅🐅🐅
Advertisement— BANDLA GANESH. (@ganeshbandla) July 22, 2022
Advertisement
‘తాతలు తండ్రులు ఉంటే సరిపోదు.. టాలెంట్ కూడా ఉండాలి. ఎన్టీఆర్‌లా మహేష్ బాబులా రామ్ చరణ్‌లా గుర్తు పెట్టుకో బ్రదర్ అంటూ ట్వీట్ పెట్టాడు. ఇది కచ్చితంగా విజయ్ దేవరకొండకు బండ్ల గణేశ్ కౌంటర్ ఇచ్చాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. బండ్ల గణేశ్ ట్వీట్‌పై విజయ్ దేవరకొండ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.
Read Also : Samantha : పెళ్లంటేనే ఒక కేజీఎఫ్ అంటూ సామ్ షాకింగ్ కామెంట్లు…!
Tufan9 Telugu News providing All Categories of Content from all over world