Hyd Metro Station : మెట్రోలో చిందులేస్తూ తగ్గేదేలే అంటున్న యువతి… మరో వీడియో పెట్టేసిందిగా..!

Hyd Metro Station : ఈ రోజుల్లో యువత ఎక్కువగా మీడియాలోనే ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడుతున్నారు. అడపదడపా రీల్స్ చేస్తూ తమ ఇమేజిని పెంచుకుంటున్నారు. రీల్స్ చేసేందుకు సరైన ప్లేస్ అంటూ లేకుండా ఎక్కడపడితే అక్కడ చేస్తున్నారు. ఎవరైనా చూస్తారనే భయం కూడా లేకుండా వీడియోస్ చేసి పోస్ట్ లు పెడుతున్నారు.

హైదరాబాద్ మెట్రో రైల్ లో వికృత చేష్టలు నానాటికీ పెరుగుతూ ఉన్నాయి. మెట్రో స్టేషన్ నీ కేంద్రంగా చేసుకొని వీడియోస్ తో పాటు సెల్ఫీ లు కూడా తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు.  అయితే నిన్న మెట్రో స్టేషన్ వెలుపల ఒక యువతి డాన్స్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందంగా ఉన్న ఈ అమ్మాయి ఏకంగా మెట్రో స్టేషన్ లోనే అందరి ముందు చిందులేసింది. రా రా రకమ్మ అనే పాటకు డాన్స్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పోస్ట్ చేసిన కొద్ది క్షణాల్లోనే వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో పైన మెట్రో అధికారులు స్పందించారు.

Hyd Metro Station : మెట్రోలో మళ్లీ రెచ్చిపోయిన యువతి… మరో పాటతో డాన్స్.. వీడియో

ఆమె ఏ స్టేషన్లో చేసిందో గుర్తించి ఆమె పై చర్యలు తీసుకుంటామని చెప్పారు.  అవన్నీ పక్కన పెట్టి ఇవాళ ఏకంగా అంటే సుందరానికి సినిమా నుంచి తందనాన నంద అనే పాటకి మెట్రో లోనే డాన్స్ చేసి మరో వీడియోని తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇలా పబ్లిక్ ప్లేస్ లో అందర్నీ పట్టించుకోకుండా డాన్స్ చేయడం ఏంటని అందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే అధికారులు చర్యలు తీసుకోవాలని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Read Also : Samantha : సమంతపై ఘోరంగా నెటిజన్ల ట్రోల్స్.. ఎంతైనా ‘మామ‘ ఎఫెక్ట్.. వీడియో!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel